సెలబ్రిటీస్ క్రిస్మస్ విషెస్.. టాటూ వేయించుకున్న ఈ హీరోని గుర్తు పట్టారా!

10TV Telugu News

Christmas 2020: నేడు క్రిస్మస్ సందర్భంగా సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంట్లో క్రిస్మస్ ట్రీస్, రంగరంగుల లైటింగ్స్, శాంతాక్లాజ్‌లను అలంకరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి క్రిస్మస్ ట్రీ తో తీసుకున్న ఫొటో షేర్ చేసి అందరికీ విషెస్ తెలియజేశారు.

Christmas

సూపర్ స్టార్ మహేష్, నమ్రతల క్యూట్ కిడ్స్ గౌతమ్, సితార పాప క్రిస్మస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వారి పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే మహేష్ బావ సుధీర్ బాబు క్రిస్మస్ విషెస్ తెలుపుతూ షేర్ చేసిన పిక్ బాగా వైలర్ అవుతోంది. ఆ ఫొటోలో వీపుపై క్రిస్మస్ ట్రీ ను టాటూగా వేయించుకున్నాడు సుధీర్. ఈ పిక్ ఆకట్టుకుంటోంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన కపుల్ మెగా అండ్ అల్లు ఫ్యామిలీస్ వారికి క్రిస్మస్ ట్రీట్ ఇచ్చారు. కొత్త జంట నిహారిక కొణిదెల, చైతన్య, అల్లు బాబీ, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, శిరీష్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, శ్రీజ, కళ్యాణ్, సుస్మిత, విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొని సందడి చేశారు.

Christmas

×