KV Anand : దర్శకుడు కె.వి. ఆనంద్‌కు సెలబ్రిటీల నివాళి..

అల్లు అర్జున్, సిద్దార్థ్, హన్సిక, ఖుష్బూ, పృథ్విరాజ్ సుకుమారన్, అంజలి, దుల్కర్ సల్మాన్, నవీన్ పౌలి, సిబి సత్యరాజ్, గౌతమ్ కార్తీక్, మోహన్ రాజా వంటి పలువురు సెలబ్రిటీలు కె.వి. ఆనంద్‌కు నివాళులర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు..

KV Anand : దర్శకుడు కె.వి. ఆనంద్‌కు సెలబ్రిటీల నివాళి..

Kv Anand

KV Anand: ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్‌ (54) శుక్ర‌వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో చెన్నైలో క‌న్నుమూశారు. ఆనంద్ మరణవార్తతో తమిళ చిత్ర పరిశ్రమ షాక్ అయింది.. ఎంతో కష్టపడి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుని, విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్ ఇకలేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నారు..

KV Anand

KV Anand

ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పలుభాషలకు చెందిన నటీనటులు, సాంకేతికనిపుణులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు.. రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, (మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘తెన్మావిన్ కొంబత్’ (Thenmavin Kombath) తో కెమెరామెన్‌గా పరిచయమయ్యారు ఆనంద్.. బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌గా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డ్ అందుకున్నారు)..

కార్తి, అల్లు అర్జున్, సిద్దార్థ్, హన్సిక, ఖుష్బూ, పృథ్విరాజ్ సుకుమారన్, అంజలి, దుల్కర్ సల్మాన్, నవీన్ పౌలి, సిబి సత్యరాజ్, గౌతమ్ కార్తీక్, మోహన్ రాజా వంటి పలువురు సెలబ్రిటీలు కె.వి. ఆనంద్‌కు నివాళులర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు..