కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు :రైతులకు మరిన్ని రాయితీలు

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 10:10 AM IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు :రైతులకు మరిన్ని రాయితీలు

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త ప్యాకేజీ ప్రకటించారు. MSMEలకు అదనంగా రూ. 3 లక్షల కోట్లకు ఆమోదం తెలిపింది. దీనికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. రైతులకు మరిన్ని రాయితీలు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం నిల్వలపై పరిమితి ఎత్తివేసింది. వలస కార్మికులకు ఆహార ధాన్యాల సరఫరాకు కొత్త పథకాన్ని రూపొందించారు.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనకు, బొగ్గు గనుల వేలంపై కొత్త విధానానికి పచ్చజెండా ఊపింది. నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు నగదు నిల్వల లోటు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ మాపీ చేయాలనే నిర్ణయం తీసుకుంది. 

Read:వలస కార్మికులకు బస్సులు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ లీడర్లపై కేసులు