Cooking Oil : కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు

వంటనూనె రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పోటీగా పెరిగిన వంటనూనె ధర.. త్వరలో దిగిరానుందని సమాచారం.

Cooking Oil : కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు

Cooking Oil

Cooking Oil : వంటనూనె రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పోటీగా పెరిగిన వంటనూనె ధర.. త్వరలో దిగిరానుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం సోయాబీన్, సన్ ఫ్లవర్, ముడి పామ్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్స్ సుంకo రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. మార్చి 2022 వరకు వీటిపై విధిస్తున్న అగ్రి‌సెస్ కూడా తొలగించాలని నిర్ణయించింది. దీంతో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

చదవండి :  కాక రేపుతున్న కన్నడ రాజకీయం..సిద్ధరామయ్య-యడియూరప్ప రహస్య భేటీ!

ఈ ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అక్టోబర్ 14 నుంచి మార్చి 31, 2022 వరకు అమల్లోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గడిచిన 8 నెలల్లో లీటర్ వంటనూనెపై ఏకంగా 90 రూపాయాలు పెరిగింది. ఓ వైపు గ్యాస్ ధరలు మరోవైపు వంటనూనె ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ రెంటి ధరల పెరుగుదలతో హోటల్స్ ఆహార పదార్దాల రేట్లను భారీగా పెరిగాయి.

చదవండి :  ఇండస్ట్రీ పెద్ద ఎవరు?? మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి..