DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. డియర్‌నెస్ అలోవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను 3శాతం పెంచుతూ.. 31శాతం నుంచి 34శాతానికి చేసినట్లు వెల్లడించింది.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Da Hike

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. డియర్‌నెస్ అలోవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను 3శాతం పెంచుతూ.. 31శాతం నుంచి 34శాతానికి చేసినట్లు వెల్లడించింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా ఈ పెంపుదల వర్తిస్తుందని బుధవారం ఇండియా టీవీ వెల్లడించింది. రీసెంట్ గా జరిగిన మార్పులు జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తాయి.

పెరిగిన డీఏ, డీఆర్ లు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.62లక్షల మంది పెన్షనర్లకు బెనిఫిట్ కానున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాతే 2022 జనవరి 1నుంచి మార్పులు అమలవుతాయని ప్రకటించారు.

“ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించబడిన ఫార్ములాకు అనుగుణంగా ఉంది” అని పేర్కొంది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి ద్వారా ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ.9వేల 544.50 కోట్లుగా ఉంటుంది.

Read Also: ఆ రెండ్రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు

తొమ్మిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు లీటరుకు 5 రూపాయలకు పైగా పెంచిన తరుణంలో ఈ పెంపు జరిగింది. ఆకాశాన్నంటుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం మధ్య కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు చాలా ఉపశమనాన్ని అందించనుందని విశ్లేషకులు అంటున్నారు.