కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణం : రాష్ట్రాలమీదే నెపాన్ని నెట్టేసిన కేంద్రం

  • Published By: srihari ,Published On : May 6, 2020 / 05:16 AM IST
కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణం : రాష్ట్రాలమీదే నెపాన్ని నెట్టేసిన కేంద్రం

కరోనా వైరస్ కేసులు అకస్మాత్తుగా పెరగడానికి రాష్ట్రాలే కారణమని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలు రిపోర్టింగ్ ఆలస్యం చేస్తుండం వల్ల సోమవారం నుంచి కరోనావైరస్ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని మంగళవారం (మే 5, 2020) పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో భారతదేశంలో సుమారు 3,900 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 195 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు అత్యధిక మరణించిన వారి సంఖ్య ఇదే. రిపోర్టు చేసిన కేసుల ఆధారంగా కాంటాక్ట్ ట్రేసింగ్, యాక్టివ్ కేస్ సెర్చ్, కేసుల క్లినికల్ మేనేజ్‌మెంట్ చేయమని కేంద్రాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించిన తర్వాతే ఇవి వెలుగులోకి వచ్చాయి. 

కొన్ని రాష్ట్రాలు కోవిడ్ -19 కేసులను సకాలంలో రిపోర్టు చేయడం లేదు. గట్టిగా అడిగితేనే ఆయా కేసులను రిపోర్టు చేశాయి. మంగళవారం నుంచి కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి ఇదే కారణమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ అన్నారు. గత 24 గంటలలో రిపోర్టు చేసిన కొత్త కేసులు, మరణాల సంఖ్య ఇప్పటివరకు ఇతర రోజుల్లో అత్యధికంగా నమోదు కాలేదు. కేసుల సకాలంలో రిపోర్టింగ్, నిర్వహణ చాలా కీలకమన్నారు. కొన్ని రాష్ట్రాల్లో గ్యాప్ ఉన్నట్టుగా గుర్తించాము. తరువాత వీటిని పరిష్కరించినట్టు చెప్పారు. 

కోవిడ్ -19 బారినుంచి ఇప్పటివరకు మొత్తం 12,726 మంది కోలుకున్నారు మంగళవారం నాటికి దేశంలో రికవరీ రేటు 27.41 శాతానికి చేరుకుంది. లాక్‌డౌన్ పాజిటివ్ ఫలితాలను ఇచ్చింది. లాక్ డౌన్ ముందు 3.4 రోజుల నుంచి ఇప్పుడు 12 రోజులకు రెట్టింపు సమయం మెరుగుపడిందనే చెప్పాలి. అదే సమయంలో రిపోర్టుల వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని అగర్వాల్ అన్నారు. హోం మంత్రిత్వ శాఖ పాక్షికంగా సడలింపులను ఇచ్చిందన్నారు. కొన్ని ఆఫీసులు తెరవడానికి వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కార్యాలయాల్లో తగినంత థర్మల్ స్క్రీనింగ్, ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, చేతులు కడుక్కోనేలా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.

వర్క్-షిఫ్టులు, భోజన గంటలు గరిష్టంగా భౌతిక దూరం ఉండేలా చూడాలి. ఆఫీసులు, కంపెనీ రవాణా కూడా దూరం ఉండేలా చూడాలని ప్రభుత్వం తెలిపింది. గ్రీన్, ఆరెంజ్ జోన్స్ అని పిలిచే సడలింపులను ప్రకటించిన వెంటనే, ముఖ్యంగా మద్యం దుకాణాల వద్ద రద్దీగా మారింది. కోవిడ్ -19 కేసుల పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీని కారణంగా లాక్ డౌన్ ప్రయోజనాలను దెబ్బతిసే అవకాశం లేకపోలేదు. 

Also Read | మే 1 నుంచి తగ్గుతున్న కోవిడ్-19 కేసుల గ్రోత్ రేటు