Vaccination: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదన్న కేంద్రం

కొవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియలో భాగంగా పూర్తి గైడ్ లైన్స్ అనుసరించామని, ఎవరినీ బలవంతపెట్టి వ్యాక్సినేషన్ చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పని

Vaccination: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదన్న కేంద్రం

Vaccintaion

Vaccination: కొవిడ్-19 టీకాలు వేసే ప్రక్రియలో భాగంగా పూర్తి గైడ్ లైన్స్ అనుసరించామని, ఎవరినీ బలవంతపెట్టి వ్యాక్సినేషన్ చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసి.. వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతపెట్టలేదని సుప్రీం కోర్టుకు వెల్లడించింది. ఎన్జీఓ ఎవరా ఫౌండేషన్ వేసిన ప్లీకు బదులిచ్చిన కేంద్రం అఫిడవిట్ లో పూర్తి వివరాలు వెల్లడించింది.

‘భారత ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూనే వ్యాక్సినేషన్ చేపట్టాం. బలవంతంగా వ్యాక్సినేషన్‌కు ప్రేరేపించలేదు. మహమ్మారి చెలరేగుతుండటంతో ప్రజాసక్తి మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాం’ అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

‘అవగాహన కల్పించి, వారితో చర్చించి అర్హులంతా వ్యాక్సిన్ వేసుకునేలా చేశాం. వ్యవస్థను, ప్రక్రియను ఆ విధంగా డిజైన్ చేశాం. ప్రత్యేకించి ఏ వ్యక్తినీ బలవంతపెట్టడం వంటివి జరగలేదు. వారి ఇష్టం మేరకే వ్యాక్సినేషన్ జరిగింది’ అని అందులో వివరించారు.

ఇది కూడా చదవండి: ఆప్ నిజాయతీతో కూడిన పార్టీ అని పీఎం మోదీనే చెప్పారు – కేజ్రీవాల్

దేశంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమై సంవత్సరమైంది. ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాపై కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. భారత్ లో కరోనా నియంత్రణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికే 70శాతంమందికి అందింది.

కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. శాస్త్రవేత్తల కృషితో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ తో కరోనా కట్టడి అయ్యింది. ఇది దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఊరటనిచ్చిందని చెప్పాల్సిందే.