COVID-19: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలంగాణకు కేంద్రం సూచన

తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.

COVID-19: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. తెలంగాణకు కేంద్రం సూచన

Covid 19

COVID-19: తెలంగాణతోపాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమైంది. కరోనాను అదుపు చేసే తగిన చర్యలు తీసుకోవాలని, టెస్టులు నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్రాలకు శుక్రవారం లేఖలు రాసింది. అంతకుముందు వారం దేశవ్యాప్తంగా 15,708 కేసులు నమోదుకాగా, గత వారం 21,055 కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటమే కారణమని కేంద్రం భావిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోగుల లక్షణాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

‘‘కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడమే దేశవ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యేందుకు కారణం. ఈ రాష్ట్రాల్లో స్థానికంగా కోవిడ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఇంతకుముందు ప్యాండెమిక్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాట ఫలితాల్ని పోకుండా చూసుకోవాలి. దీని కోసం టెస్టుల సంఖ్య పెంచడం, జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టడం చేయాలి. కరోనాను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్‌ను అదుపు చేసేందుకు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. తెలంగాణలో మే 27కు ముందు వారంలో 283 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి వారంలో 375 కేసులు నమోదయ్యాయి.