Centre's notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు Centre's notice to Ola, Uber over rising complaints seeks reply in 15 days

Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు

క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్‌లకు కేంద్రం నోటీసులు

Centre’s notice to cab aggregators: క్యాబ్ వినియోగదారులు నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. క్యాబ్ నిర్వహణా సంస్థలైన ఓలా, ఉబర్, మేరు, ర్యాపిడో, జుగ్ను వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కొంతకాలంగా క్యాబ్ సంస్థలపై వినియోగదారులు భారీ ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు.

drones deliver medicines: గ్రామాలకు డ్రోన్లతో మందుల సరఫరా.. సత్ఫలితాలిచ్చిన ట్రయల్స్

క్యాబ్ సంస్థలు ఉన్నట్లుంచి ఛార్జీలు పెంచుతున్నాయి. ఏసీ వాడేందుకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతోపాటు క్యాన్సిలేషన్ ఛార్జీలు, కొన్ని రూట్లలో సర్వీసులు తగ్గిపోవడం, డ్రైవర్లు డిజిటల్ పేమెంట్స్ బదులు క్యాష్ కావాలని డిమాండ్ చేయడం వంటి అంశాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పందించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అయిన ‘సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)’ క్యాబ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే

అలాగే కంపెనీ అనుసరిస్తున్న అల్గారిథమ్స్ కూడా ఇవ్వాలని కోరింది. కంపెనీలు కస్టమర్ల సమస్యలపై సరిగ్గా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. ఇటీవలి కాలంలో ఇంధన ధరలు పెరగుతుండటంతో ఉబర్ సంస్థ చార్జీలను భారీగా పెంచుతోంది. డ్రైవర్లకు చెల్లింపులను కూడా త్వరగా చేస్తోంది. వారానికి రెండుసార్లు పేమెంట్స్ ఇస్తోంది. కస్టమర్లు ఇకపై ఏ మోడ్‌లో పేమెంట్ చేయొచ్చో డ్రైవర్లకు ముందుగానే సూచించేలా యాప్ అప్‌గ్రేడ్ చేసింది.

×