Incom Tax : ఛాయ్, సమోసా అమ్ముతూ..వందల కోట్లు వెనకేసి..

అందరికి షాకులిచ్చే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకే ఛాయ్ సమోసా వ్యాపారులు ఇచ్చిన దమ్కీతో మతిపోయింది.

Incom Tax : ఛాయ్, సమోసా అమ్ముతూ..వందల కోట్లు వెనకేసి..

Incomtax

Incom Tax : ఛాయ్, సమోసా వ్యాపారం అని తేలికగా తీసి పారేయకండి…ఆ వ్యాపారం చేసే వారి అస్తులు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. అలాగని అలాంటి వ్యాపారం చేసేవారంతా సంపాదించేస్తున్నారను కోవటం పొరపాటే..మరి కోట్లు సంపాదిస్తున్నది ఎవరంటే ఉత్తరప్రదేశ్ లోని కొందరు ఛాయ్, సమోసా వ్యాపారులు.. అవును మీరు వింటున్నది నిజమే యూపీలోని ఛాయ్, సమోసా వ్యాపారుల ఇళ్ళపై దాడులు చేసిన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వారి ఆస్ధులు చూసి నివ్వెరపోయారు.

అందరికి షాకులిచ్చే ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులకే ఛాయ్ సమోసా వ్యాపారులు ఇచ్చిన దమ్కీతో మతిపోయింది. కాన్పూరులోని కొందరు టీ,కాఫీ,సమోసా, ఛాట్ సమోసా అమ్ముకునే వ్యాపారులు వందలకోట్ల ఆస్ధులు కూడబెట్టి ఇన్ కమ్ ట్యాక్స్ ఎగొట్టేశారు. చిన్న వ్యాపారులు కదా వాళ్ళేమి కడతారులే అనుకున్నారేమో ఇంతకాలం పెద్దగా వారిపై దృష్టి సారించలేదు. అయితే అనూహ్యంగా జరిపిన దాడుల్లో అసలు వ్యవహారం బట్టబయలవటంతో అధికారులు కంగుతిన్నారు.

మొత్తం 256 మంది వ్యాపారుల వివరాలను పరిశీలించగా వారికి సంబంధించిన వందలకోట్ల విలువైన ఆస్తుల పత్రాలు లభించాయి. జీఎస్టీ చెల్లించకుండా వ్యాపారాలు నిర్వహించినట్లు కనుగొన్నారు. ప్రాధమిక దర్యాప్తులో వీరికి 375కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించగా , ప్రస్తుతం దాడులను కొనసాగిస్తున్నారు.