Metro Train : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి మెట్రో సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. చివరి మెట్రో రైలు సర్వీస్‌ సమయాన్ని అర్ధగంటపాటు పొడిగించారు.

Metro Train : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు

Metro Rail

Changes in Metro train times : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి మెట్రో సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. చివరి మెట్రో రైలు సర్వీస్‌ సమయాన్ని అర్ధగంటపాటు పొడిగించారు. రాత్రి 10.15 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీస్‌ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రాత్రి 9.45 గంటల వరకే ఉన్న చివరి మెట్రో సర్వీస్‌ను అర్ధగంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఉదయం 7 గంటల నుంచి మెట్రో రైలు సేవలు కొనసాగుతాయి.

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు బయటకు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. హైదరాబాద్‌లో సిటీ బస్సులతో పాటు మెట్రో రైళ్లల్లోనూ రద్దీ క్రమంగా పెరుగుతోంది. దీంతో మెట్రో అధికారులు రైలు సర్వీసుల్లో కీలక మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్‌ 6, 2021) నుంచి మరో అర్ధగంటపాటు మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా మహమ్మారి కారణంగా మెట్రో సర్వీసులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అనంతరం సర్వీసులు తిరిగి ప్రారంభం కాగా సెకండ్ వేవ్‌లో మళ్లీ మూతపడ్డాయి. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మెట్రో సర్వీసులను ప్రారంభించారు. అన్ని వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు విద్యా సంస్థలు కూడా పున:ప్రారంభం కావడంతో మెట్రో రైలు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.