Millets Diet : మారుతున్న ఆహారపు అలవాట్లు… చిరుధాన్యాలవైపు మొగ్గు

2020 మార్చి వరకు నిర్వహించన ఓ సర్వే ప్రకారం పోషకాలు అధికంగా కలిగిన ఆహారానికి బాగా మంచి గిరాకీ లభించింది. లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇంటికే పరిమితం కావ

Millets Diet : మారుతున్న ఆహారపు అలవాట్లు… చిరుధాన్యాలవైపు మొగ్గు

Millets1

Millets Diet : కరోనా ప్రభావంతో ఆరోగ్యం విషయంపై అందరిలో అవగాహన బాగా పెరిగింది. ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది…ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అన్నదానిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. చాలా మంది తమ ఆహారపు అలవాట్లలోను అనేక మార్పులను చేసుకుంటున్నారు. పోషక విలువలున్న చిరుధాన్యాలు, వాటి అనుబంధ ఉత్పత్తుల వినియోగంపై అధికశాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు.

చిరుధాన్యాలు ప్రస్తుతం ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. కొర్రలు,రాగులు,సజ్జలు,జొన్నలు వంటి వాటిని వినియోగించి రుచికరమైన ఆహారపదార్ధాలను తయారుచేసుకుని తింటున్నారు. కొర్రల ఉప్మా, దోశ, కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్నట్టు ఉప్మా, కొర్ర పాయసం, రాగి జావ వంటి వెరైటీలను చేసుకుంటున్నారు. అదికూడా ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగైన చిరుధాన్యాలను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదిలావుంటే 2020 మార్చి వరకు నిర్వహించన ఓ సర్వే ప్రకారం పోషకాలు అధికంగా కలిగిన ఆహారానికి బాగా మంచి గిరాకీ లభించింది. లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఇంటికే పరిమితం కావటం, కరోనానో ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవాలన్న వైద్యుల సూచనతో చిరుధాన్యాలపై తమ దృష్టిని మరల్చారు. ఈక్రమంలో అనేక కంపెనీలు చిరుధాన్యాలతో తయారు చేసిన రెడీ టూ కుక్, రెడీ టూ ఈట్ ఆహార పదార్ధాల తయారు చేస్తూ మార్కెట్ లో అందుబాటులోకి తీసుకువచ్చాయి.

దేశ వ్యాప్తంగా ఏడాది కాలంలో చిరుధాన్యాలు, ఓట్స్ బిజినెస్ 300 మిలియన్ డాలర్లకు చేరింది. చిరుధాన్యాలతో తయారైన పరోటా, చపాతీ, ఉప్మా, ఇడ్లీ, దోశ మిక్స్ వంటివాటిని తయారు చేసి విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలతో తయారైన ప్యాకింగ్ ల వినియోగం ఏడాది క్రితం వరకు 12శాతం మాత్రమే ఉండగా ప్రస్తుతం అది 20శాతానికి పెరిగింది.

గతంలో బియ్యంతో తయారైన వాటిని ఆహారంగా తీసుకునే వారిలో చాలా మంది చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార పదార్ధాలను తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాకు చెందిన కెల్లాగ్స్ ఫ్రూట్ లూప్స్ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. కార్న్ ఫ్లేక్స్ తరహాలోనే మిల్లెట్ ఫ్లేక్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. వాటని కొనుగోలు చేసి పాలల్లో కలుపుకుని తాగేస్తున్నారు. జొన్నలు,కొర్రలు, రాగి తదితర చిరుధాన్యాలకు సంబంధించిన రవ్వలు, పిండ్లు రెడీ టూ కుక్ తరహాలో ప్యాకింగ్ చేసి విక్రయిస్తుండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు.

చిరుధాన్యాలతో తయారైన ప్యాకింగ్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంపై దృష్టిసారించాయి. పాతతరం అప్పట్లో చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవటం వల్లనే ఎక్కవకాలం ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా జీవించగలిగారు. ఆతరువాత ఆహారంలో చోటు చేసుకున్న మార్పుల కారణంతో అయుర్ధాయం తగ్గటంతోపాటు అనేక వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రస్తుత కరోనా పరిస్ధితుల్లో తిరిగి అందరి దృష్టి మిల్లెట్ ఫుడ్స్ పై మళ్ళటం మంచి పరిణామమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.