Jeevan Kumar : చిన్న న‌టుడు..పెద్దమనసు.. రియల్ లైఫ్‌లో హీరోగా నిలిచిన జీవన్ కుమార్..

రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌టుడు జీవ‌న్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండ‌గా నిలుస్తుంది. గ‌తేడాది క‌రోనా క‌ష్ట‌కాలంలో నిత్యావ‌స‌ర వస్తువులు, కూర‌గాయల‌, భోజ‌నం పంపిణీ చేసిన జీవ‌న్ కుమార్ అండ్ టీం సేవ‌లు ఇప్పుడు కూడా నిరంత‌రాయంగా కొన‌సాగుతున్నాయి..

Jeevan Kumar: క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో న‌టుడు జీవ‌న్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి అండ‌గా నిలుస్తుంది. గ‌తేడాది క‌రోనా క‌ష్ట‌కాలంలో నిత్యావ‌స‌ర వస్తువులు, కూర‌గాయల‌, భోజ‌నం పంపిణీ చేసిన జీవ‌న్ కుమార్ అండ్ టీం సేవ‌లు ఇప్పుడు కూడా నిరంత‌రాయంగా కొన‌సాగుతున్నాయి.

నిరుపేద‌లు, క‌రోనా బారిన ప‌డి ఎవ‌రి అండా లేని వారికి జీవ‌న్ కుమార్ అండ్ టీం మేమున్నాం అనే భ‌రోసానిస్తుంది. మూడు వంద‌ల మంది క‌రోనా పేషెంట్స్‌కు రోజూ క‌డుపు నింపుతున్నారు జీవ‌న్. సాయం ఎలాంటిది అయినా త‌న శ‌క్తికి మించి సాయం అందిస్తున్న ఇత‌ని పెద్ద మ‌న‌సును అంద‌రూ కొనియాడుతున్నారు.

న‌టుడిగా ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ నుండి మొద‌లైన జీవన్ ప్ర‌యాణం స‌క్సెస్‌పుల్‌గా కొనసాగుతుంది. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘జాతిర‌త్నాల‌ు’ లో అత‌ని పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. స్వ‌త‌హాగా రెస్టారెంట్ బిజినెస్‌లో అనుభ‌వంగల జీవ‌న్ కుమార్ గ‌త సంవ‌త్స‌రం త‌న రెస్టారెంట్‌నుండే క‌రోనా స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగించారు. మ‌న‌వ‌తావాదిగా జీవ‌న్ కుమార్ అందించిన సేవ‌ల‌ను సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్ కొనియాడారు. ఇప్పుడు కూడా జీవ‌న్ త‌న దాతృత్వాన్ని వ‌ద‌ల‌లేదు.

త‌న టీంతో బ‌ద్రాద్రి కొత్త‌గూడంలోని ట్రైబ‌ల్ ఎరియాల‌కు 10వేల కేజీల రైస్ పంపిణీ చేశారు. ఆక్సిజ‌న్ కొర‌త ఇప్ప‌డు ఎంత పెద్ద స‌మ‌స్యో అంద‌రికీ తెలిసిందే. ఈ టైం లో ఆక్సిజ‌ర్ రీఫిలింగ్ సెంట‌ర్‌ల‌ను 200 సిలెండ‌ర్స్‌ని అత్య‌వ‌స‌ర కేసుల‌కు అందించ‌గ‌లిగారు. మాస్క్‌లు శానిటైజ‌ర్స్ అందుబాటులో లేని పేద‌ల‌కు వాటిని ఇంటి ఇంటికి తిరిగి పంపిణీ చేసి వాటిపై అవ‌గాహాన క‌ల్పించారు.

క‌రోనా సెంకండ్ వేవ్ మొద‌లైన ద‌గ్గ‌ర నుండి త‌న టీంతో కలిసి రోజూ మూడు వంద‌లకు పైగా క‌రోనా పేషెంట్స్‌కి షౌష్టికాహారం అందిస్తున్నారు జీవ‌న్ కుమార్. అత‌ని సేవ‌ల‌కు సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు తెలుపుతున్నారు. జీవ‌న్ త‌న కున్న సేవా గుణంతో చేస్తున్న సేవ‌ల‌కు చాలా మంది అండ‌గా నిలుస్తున్నారు. జీవ‌న్ న‌టుడిగా త‌న‌దైన ప్ర‌యాణం చేస్తూనే నిజ జీవితంలో హీరోగా నిలిచారు..

ట్రెండింగ్ వార్తలు