Charging With Sweat : చెమటతో సెల్ ఫోన్ ఛార్జింగ్.. సరికొత్త పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

అమెరికాలోని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్లలు చెమట సహయంతో సెల్ ఫోన్ ను ఛార్జ్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. దానికి సంబంధించిన నమూనా పరికరాన్ని రూపొందించారు.

Charging With Sweat : చెమటతో సెల్ ఫోన్ ఛార్జింగ్.. సరికొత్త పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

చెమటతో సెల్ ఫోన్ చార్జింగ్

Charging With Sweat : శాస్త్ర సాంకేతిక పరిజ్జానం కొత్త పుంతలు తొక్కుతుంది. పరిశోధనలు కొత్త ఆవిష్కరణలకు దారి చూపిస్తున్నాయి. గాలిలో ఎగిరే కారు, నీటితో నడిచే వాహనాలు ఇలా సరికొత్త టెక్నాలజీలకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా జీవం పోస్తున్నారు. ప్రస్తుతం అందరిని ఆశ్ఛర్యపరిచేలా చెమటతో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీని కనిపెట్టేశారు. ఈ పరికరంతో ఇకపై బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందన్న చింత అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకి వెళితే

అమెరికాలోని శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్లలు చెమట సహయంతో సెల్ ఫోన్ ను ఛార్జ్ చేసే పరికరాన్ని కనిపెట్టారు. దానికి సంబంధించిన నమూనా పరికరాన్ని రూపొందించారు. చేతి వేళ్ళకు ప్లాస్టర్ తరహాలో దీనిని ధరించాల్సి ఉంటుంది. రాత్రి వేళ్ళల్లో నిద్రిస్తున్నప్పుడు, కూర్చున్న సమయంలో, చెమటబయటకు రావటం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దానిని ద్వారా సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది.

సెంటీ మీటర్ పరిమాణంలో ఉండే ఈ పరికరంలో కార్బన్ నురగతోపాటు, చిన్న ఎలక్ట్రోడ్ చిప్ ను అమర్చారు. కార్బన్ నురగ చేతి వేళ్ళ నుండి వచ్చే చెమట గ్రహిస్తే, ఎలక్ట్రోడ్ల లోని ఎంజైములు కణాల మధ్య రసాయన చర్య జరిపి విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఎలక్ట్రోడ్ ల క్రింద ఉండే చిన్న చిప్ ను నొక్కితే అది శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ప్రస్తుతం ఒక సెల్ ఫోన్ ను ఛార్జి చేసేందుకు మూడు వారాల సమయం తీసుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న రోజుల్లో దీని యొక్క సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఒక వేలికి 10గంటలు ధరిస్తే 24 గంటలకు సరిపడ శక్తిని నిల్వ చేయగలిగింది. అదే అన్ని వేళ్ళకు ధరిస్తే ఎక్కువ శక్తి నిల్వకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చెమట కోసం ఎలాంటి వ్యాయామాలు అవసరం లేదని అంటున్నారు.