iPhone SE కంటే చౌకైన iPhone 12 అరచేతి సైజుతో వస్తోంది!

  • Published By: srihari ,Published On : June 20, 2020 / 10:53 AM IST
iPhone SE కంటే చౌకైన iPhone 12 అరచేతి సైజుతో వస్తోంది!

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాదిలో 4 విభిన్న ఐఫోన్ 12 వెర్షన్లను విడుదల చేస్తోంది. అందులో iPhone 12 డివైజ్.. చిన్న సైజులో ఇదే మొదటిది. అన్ని ఐఫోన్ 12 మోడళ్లు 5G కనెక్టివిటీకి సపోర్టు చేసేలా ఉన్నాయి. వీటిలో అన్ని OLED స్క్రీన్‌లే ఉన్నాయి. ఈ 4 ఐఫోన్ 12 వెర్షన్లలో కొన్ని వెర్షన్లకు లాంచింగ్ ఆలస్యం కానుంది. కరోనావైరస్ కారణంగా లాంచింగ్ ఆలస్యంగా ప్రారంభమ్యే అవకాశాలు ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

CAD డిజైన్లతో తయారైన ఐఫోన్ 12 డమ్మీ యూనిట్లను ముందుగా రిలీజ్ చేసింది. వాటిలో ఒకటి చౌకైన ఐఫోన్ 12 మోడల్ 2020 ఐఫోన్ SE కంటే చాలా చిన్నదిగా ఉంటుందని సూచిస్తుంది. కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తున్న ఐఫోన్ కొనుగోలుదారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 5.4-అంగుళాల ఐఫోన్ 12, 4.7-అంగుళాల ఐఫోన్ SE కంటే చిన్నదిగా ఉంటుందనే వార్త ఐఫోన్ల గురించి తెలిసినవారిని ఆశ్చర్యపరుస్తోంది. 

ఐఫోన్ X 2017లో లాంచ్ కాగా.. దాదాపు ఐఫోన్ 8 మాదిరిగానే ఉంటుంది. 5.8-అంగుళాల డిస్‌ప్లే తో వచ్చింది. ఐఫోన్ 8 4.7-అంగుళాల స్క్రీన్ కంటే 1.1-అంగుళాల పెద్దదిగా ఉంటుంది. ఐఫోన్ 8 మోడల్  లార్జ్, సిమింట్రికల్ టాప్, బాటమ్ బెజెల్స్‌ను కలిగి ఉంది. ఆపిల్ టాప్ నాచ్‌ను ఐఫోన్ X తగ్గించింది. కిందిభాగంలో నాచ్ బుల్ట్ ఇన్ టచ్ ఐడి హోమ్ బటన్‌ను తొలగించింది.

అందుకే ఒకే ఫూట్ ఫ్రింట్ ఫీచర్ ఉన్న రెండు డివైజ్‌లు వేర్వేరు స్క్రీన్ సైజును కలిగి ఉంటాయి. 2020 ఐఫోన్ SE ఐఫోన్ 8కి సమానంగా ఉంటుంది. ఐఫోన్ 11 ప్రో 5.8-అంగుళాల డిస్‌ప్లే సైజును కలిగి ఉంది. ఆ హ్యాండ్‌సెట్ ఐఫోన్ 8, కొత్త ఐఫోన్ SEల వలె పెద్దదిగా ఉంటుంది. EverythingApplePro ప్రకారం.. 5.4-అంగుళాల ఐఫోన్ 12, SE ఫోన్ డివైజ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. 

ఈ సంవత్సరం స్టోర్లలో 5.8-అంగుళాల ఐఫోన్ 12 ఫోన్ అందుబాటులోకి రాకపోవచ్చు. 5.4-అంగుళాల మోడల్‌ను పక్కన పెడితే.. ఆపిల్ రెండు 6.1-అంగుళాల ఐఫోన్ 12 వెర్షన్లను విక్రయిస్తుంది. వాటిలో ఒకటి ప్రో వెర్షన్ కూడా ఉంది. అతిపెద్ద ఐఫోన్ 12లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. మీరు ఐఫోన్ X, XS, లేదా 11 ప్రో నుంచి అప్‌గ్రేడ్ అవుతున్నట్లయితే అదే సైజులో 5.4-అంగుళాలు లేదా 6.1-అంగుళాలు ఉండేలా ఎంచుకోవచ్చు. 

Read: భారత్‌లో ఐఫోన్ తయారీ.. ఇక చౌకగా చేతుల్లోకి ఆపిల్ ఫోన్‌లు