చీరలు పంచుతున్నారని చెప్పి..మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

చీరలు పంచుతున్నారని చెప్పి..మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

snatch gold Mangal sutram chain woman  : ఓ వ్యక్తి ఉచితం చీరలు పంచుతున్నారని వెళ్లిన ఓ మహిళలకు టోకరా వేశాడో కేటుగాడు.చీరలు ఇస్తున్నారని తెలిసి వెళ్లితే..మెడలో బంగారు పుస్తెల తాడును పోగొట్టుకుని వెర్రిమొహం వేసిన మహిళ ఘటన తెలంగాణలో కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్‌లో బుధవారం (ఫిబ్రవరి 3.2021) మహిళ నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ చేశాడో వ్యక్తి.

అల్గునూర్‌కు చెందిన వేముల లత కొత్తపల్లిలోని తన కూతురు ఇంటికి వెళుతూ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద దిగింది. తరువాత ఆటో ఎక్కటానికి ఆటో స్టాండ్‌ వద్దకు నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి ఎదరొచ్చాడు. ఓ వ్యక్తి మహిళలకు ఉచితంగా చీరలు పంచుతుడని చెప్పాడు. కానీ..మెడలో బంగారం వేసుకుని వెళ్లినవారికి ఇవ్వరని చెప్పాడు. మెడలో ఉన్న బంగారపు పుస్తెలతాడు తీసి బ్యాగులో దాచుకుని వెళ్లండీ మీక్కూడా ఓ చీర ఇస్తాడని చెప్పాడు. దీంతో ఆమె చీర కోసం కక్కుర్తిపడింది. మెడలో ఉన్న బంగారపు పుస్తెల తాడు తీసింది. ఇంతలో చీరలు పంచుతున్నారని చెప్పిన వ్యక్తి ఆమెకు ఓ పేపర్ ఇచ్చాడు.

దాన్ని ఈ పేపర్ లో చుట్టి బ్యాగులో వేసుకోండి అంటూ అని చెప్పాడు. అలాగేనంటూ ఆమె పుస్తెల తాడుని పేపర్‌లో వేసి చుట్టాడు. ఆ తరువాత చాలా షార్పుగా రియాక్ట్ అయిన సదరు వ్యక్తి కన్ను మూసి తెరిసేంతలో..ఆమె పుస్తెలతాడు చుట్టిన పేపరు తీసుకుని..ఖాళీ పేపర్‌ను లతకు ఇచ్చాడు. అది తీసుకుని.. చీరలు అయిపోతాయనే హడావిడి బ్యాగులో వేసేసుకుంది.

దీంతో సదరు వ్యక్తి మీరు ఇక్కడే ఉండండీ..మీకోసం నేను వెళ్లి చీరలు తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు. అతను చెప్పిన మాటలు నమ్మిన లత అక్కడే నిలబడింది. చీరలు తీసుకొస్తానంటూ వెళ్లి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన లత ఇక అతను రాడనుకుని ఇంకా ఎంత సేపు నిలబడతాంలే అనుకుని పుస్తెల తాడు మెడలో వేసుకుని వెళ్లిపోదాం అనుకుని..బ్యాగ్‌ లో పేపర్ తీసి చూడగా దాంట్లో పుస్తెల తాడు కనిపించలేదు. దీంతో మోసపోయనని తెలుసుకుని..లబోదిబోమంటూ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.