యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి.. ట్రైలర్ అదిరిందిగా!..

యుద్ధం మొదలుపెట్టేదే సిపాయి.. ట్రైలర్ అదిరిందిగా!..

Check Trailer: నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘చెక్’ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా బుధవారం ‘చెక్’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

టెర్రరిస్ట్‌గా ముద్రపడ్డ ఓ యువకుడు తన ప్రావీణ్యం పొందిన చదరంగం ఆడి ఎలా శిక్షనుండి బయటపడ్డాడు అనేది కథ అని క్లుప్తంగా చెప్పారు. సాయిచంద్ డైలాగ్స్‌పై క్యారెక్టర్ రివీల్స్ చేసిన విధానం బాగుంది. నితిన్ సరికొత్త గెటప్‌లో, ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌తో ఆకట్టుకోనున్నాడనిపిస్తోంది. రకుల్ లాయర్ పాత్రలో కనిపించగా.. ప్రియా వారియర్ నితిన్ ప్రేయసిగా నటించింది.

రాహుల్ శ్రీవాత్సవ్ విజువల్స్, కళ్యాణి మాలిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్ష వర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయాగ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి.ఆనంద ప్రసాద్, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.