Haritha Haram : ఫారెస్ట్ అధికారులపై కిరోసిన్ పోసిన రైతులు

పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు చెంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను అటవీ అధికారులపై పోసి నిప్పంటించి ప్రయత్నం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారంలో చోటుచేసుకుంది.

Haritha Haram : ఫారెస్ట్ అధికారులపై కిరోసిన్ పోసిన రైతులు

Haritha Haram

Haritha Haram : పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు చెంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను అటవీ అధికారులపై పోసి నిప్పంటించి ప్రయత్నం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారంలో చోటుచేసుకుంది.

గత కొన్నేళ్లుగా మాచారం పరిధిలోని అటవీ భూములను చెంచులు సాగు చేసుకుంటున్నారు. అయితే వీటిలో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. చెంచులు సాగుచేసుకుంటున్న పోడుభూమిలో మొక్కలు నాటే ప్రయత్నం చేశారు అటవీ శాఖాధికారులు. దీంతో రైతులు అటవీ శాఖాధికారులతో చెంచులు వాగ్వాదానికి దిగారు.

అనంతరం అధికారులపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టె ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి వెనుదిరిగిన అధికారులు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడటంతో వారు శాంతించారు.