చనిపోయిన తల్లి కోసం 25 రోజులుగా శవం దగ్గరే..’మా అమ్మను బతికించు’ అంటూ చిన్నారుల ప్రార్థనలు..

చనిపోయిన తల్లి కోసం 25 రోజులుగా శవం దగ్గరే..’మా అమ్మను బతికించు’ అంటూ చిన్నారుల ప్రార్థనలు..

chennai childeren praying for dead mother  : అల్లారు ముద్దుగా తమను పెంచిన తల్లి చనిపోయింది. దీంతో అభం శుభం తెలియని చిన్నారులు తల్లడిల్లిపోయారు. ‘అమ్మా..లేమ్మా..అని పిలుస్తూ..ఏడ్చారు. మా అమ్మ చనిపోయినా దేవుడు బతికించేస్తాడు..అంటూ తల్లి శవం దగ్గరే కూర్చుని అభం శుభం తెలియని ఆ పసివాళ్లు ప్రార్థనలు చేస్తు కూర్చున్నారు. అలా ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు ఏకంగా 25 రోజుల నుంచి తిండీ నిద్రా మానేసి ఆ పిల్లలు ప్రార్థనలు చేస్తు కూర్చున్నారు. ఆ పసివాళ్లతో పాటు మరో ఇద్దరు పెద్దవాళ్లు కూడా ఉండటం విశేషం.

దేవుడా..నా అమ్మను మాకిచ్చేయ్..మా అమ్మ లేకుండా మేం ఉండలేం..మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అని దేవుడిని వేడుకుంటూ ప్రార్థనలు చేస్తున్న ఘటన ఈ ఘటన చెన్నైలో జరిగింది. చనిపోయిన తమ అమ్మ బతికి వస్తుందన్న ఆశతో అభం శుభం తెలియని పిల్లలు ప్రార్ధనలు 25 రోజులుగా తల్లి మృతదేహం వద్దే కూర్చుని ప్రార్థనలు చేస్తూ ఉండిపోయారు.

కానీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ‘‘చనిపోయిన ఆమె బ్రతికి రావటం జరగదనీ..అది సాధ్యం కాదని నచ్చచెప్పటానికి యత్నించారు. కానీ వాళ్లు ఎంతకూ వినకపోవటంతో పసివాళ్లతో కలిసి ప్రార్థనలు చేస్తున్నా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతో ఇలా జరిపినట్లు విచారణలో వాళ్లు వెల్లడించటాన్ని విన్న పోలీసులు పసివాళ్లను ఇలా మభ్య పెట్టటం సరికాదని వారికి కౌన్సిలింగ్ చేశారు.

చెన్నైలోని టీ.నగర్‌లోని దిండుగల్‌ నందవనపట్టికి చెందిన అన్నై ఇందిర పోలీసు కంట్రోల్‌రూంలో పనిచేసేది. భర్తను విడిచి తన పిల్లలతోపాటు అక్క వాసుకి..వారి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సుదర్శనంతో కలిసి ఉండేది. ఈ క్రమంలో అన్నై ఇందిర గత డిసెంబర్ 7న అనారోగ్యంతో మృతి చెందింది. మెడికల్‌ లీవులో ఉన్న ఇందిర సెలవులు ముగిసినా డ్యూటీకి రాకపోవటం..పైగా ఎటువంటి సమాచారం అందించకపోవటంతో గత గురువారం (డిసెంబర్ 31,2020) ఇద్దరు మహిళా పోలీసులు ఇందిక ఇంటికి వెళ్లి చూశారు.

ఆ సమయంలో ఇంటిలోని ఓ గది తలుపులు తాళం వేసి ఉంది. దీంతో అనుమానించిన పోలీసులు గదిలోకి వెళ్లి చూశారు. ఇందిర మృతదేహం తెల్లటి వస్త్రాలతో చుట్టి ఉంది. అక్కడే ఇందిర పిల్లలతో కలిసి మరో ఇద్దరు ప్రార్థనలు చేస్తు కనిపించారు. దీంతో వారిని పోలీసులు విచారించగా..ప్రార్థనలు చేస్తే ఇందిరా బతుకుతుందని ఓ పాస్టర్ చెప్పాడని అందుకే పిల్లలతో కలిసి.. వాసుకి, సుదర్శనం గత 25 రోజులుగా మృతదేహం వద్దే ప్రార్థనలు చేస్తు ఉండిపోయారు.

వారి మాటలు విన్న పోలీసులు షాక్ కు అయ్యారు. దిగ్భ్రాంతి చెందిన పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయినవాళ్లు బ్రతికిరారనీ..ఆ విషయాన్ని చిన్నారులకు తెలియజేయాలి తప్ప ఇలా వాళ్లను మభ్య పెట్టటం సరికాదని వాళ్లను కౌన్సిలింగ్ ఇచ్చారు.