Liquor Under Sand: ఇసుకలో దాచిన అక్రమ మద్యం.. పట్టుకున్న పోలీసులు

చెన్నై బీచ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలోని బీచ్‌లలో ప్రముఖమైంది మెరీనా బీచ్. ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు.

Liquor Under Sand: ఇసుకలో దాచిన అక్రమ మద్యం.. పట్టుకున్న పోలీసులు

Liquor Under Sand

Liquor Under Sand: చెన్నై బీచ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలోని బీచ్‌లలో ప్రముఖమైంది మెరీనా బీచ్. ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు. వాకర్స్, వర్కవుట్లు చేసేవాళ్లు, సాధారణ వ్యక్తులు ఇలా బోలెడంత మందితో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బీచ్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అయితే, చీకటిపడ్డాక మాత్రం అసాంఘిక కార్యకాలాపాలకు అడ్డాగా మారుతోంది.

Chennai : వెరైటీ దొంగ-బిర్యానీలో పెట్టుకుని బంగారం తినేశాడు

ముఖ్యంగా ఇక్కడ మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా, అక్రమ మార్గంలో మద్యం దొరుకుతోంది. దీనిపై పోలీసులకు కొద్దిపాటి సమాచారం దొరికింది. ఈ సంగతి తేల్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు బీచ్‌లో మద్యం అమ్ముతుండటాన్ని గుర్తించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. ముఠా కార్యకలాపాలు సాగిస్తున్న తీరు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

Tamilnadu : టికెట్ తీసుకోమన్నందుకు కండక్టర్ పై దాడి, మృతి

ఇసుకలో దాచి..
ఈ మద్యం విక్రయిస్తోంది మహారాష్ట్రకు చెందిన ముఠా. వీళ్లు స్థానికంగా మద్యం కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత బస్సులు, ఆటోల్లో బీచ్‌కు చేరుకుంటారు. సాధారణంగా ఇక్కడికి మద్యం బాటిళ్లను అనుమతించరు. అందుకే వీళ్లు నీళ్ల కోసం వాడే క్యాన్లలోనే నేరుగా మద్యం నింపుకొని వస్తారు. ఆ తర్వాత చుట్టు పక్కల ప్రజలు తాగి పడేసిన వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్ బాటిళ్లు సేకరిస్తారు. ఆ బాటిళ్లలో మద్యం పోసి అమ్ముతుంటారు. ఎవరైనా క్యాన్ల గురించి అడిగితే, మంచి నీళ్లు అని చెప్తారు. ఈ మద్యం క్యాన్లు ఎవరికీ కనిపించకుండా, బీచ్‌లోని ఇసుక లోపల పాతిపెడతారు. రాత్రిపూట ఎవరూ లేని సమయంలో బయటకు తీసి అమ్ముతుంటారు. ప్రధానంగా బీచ్‌లోనే నిద్రపోయే కూలీలు, జాలరులే వీళ్ల ప్రధాన టార్గెట్. వీళ్లకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటారు. పోలీసులకు అందిన సమాచారంతో మద్యం ముఠాను పట్టుకున్నారు. వీళ్ల దగ్గరి నుంచి ఇసుకలో పాతిపెట్టిన 40 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతా సభ్యుల కోసం గాలిస్తున్నారు.