మసాలా కింగ్‌ ధర్మపాల్ గులాటీకి MDH మసాలాలతో నివాళి

  • Published By: nagamani ,Published On : December 4, 2020 / 01:04 PM IST
మసాలా కింగ్‌ ధర్మపాల్ గులాటీకి MDH మసాలాలతో నివాళి

Chennai : Dharampal gulati tribute to using mdh spices masala : మసాలా కింగ్‌గా పేరొందిన MDH గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. 98 ఏళ్ల ధర్మపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ..చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 3,2020) కన్నుమూసాయి. ఆయన మరణంతో అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈక్రమంలో ధర్మపాల్‌కు ఒకవ్యక్తి వినూత్ని రీతిలో శ్రద్ధాంజలి ఘటించారు.



గ్రాఫిక్ డిజైనర్ వరుణ్ టండన్…MDH మసాలాలతో ధర్మపాల్ గులాటీ చిత్రాన్ని ఎనిమిది గంటలు కష్టపడి గీశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సందర్భంగా డిజైనర్ వరుణ్ మాట్లాడుతూ..MDH యజమాని ధర్మపాల్ ఒక రోల్ మోడల్. చిన్నపాటి ఉత్పత్తులతో గొప్పస్థాయికి చేరుకున్న గొప్ప మనిషి అని కొనియాడారు. కాగా..వరుణ్ గతంలో హాకీ లెజెండ్ బల్వీర్ సింగ్ సీనియర్ చిత్రాన్ని హాకీ స్టిక్, బాల్‌తో, ఉప్పుతో మహాత్మాగాంధీ చిత్రాన్ని, స్మయిలీ స్టిక్కర్‌తో జస్పాల్ భట్టీ చిత్రాలని రూపొందించి పలువురిని ఆకట్టుకున్నారు.



కాగా..MDH గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీపాకిస్థాన్ లోని సియాల్ కోట్ లో 1923లో జన్మించారు. ఇంత స్థాయికి ఎదిగిన ధర్మపాల్ కేవలం నాలుగవ తరగతి మాత్రమే చదువుకున్నారు అంటే నమ్మబుద్దికాదు. ఉపాధి కోసం ఎప్పుడో ఢిల్లీకి వచ్చిన ఆయన బతకటానికి గుర్రపు బండి నడిపారు. తరువాత ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని చిన్న చిన్న సరుకులు అమ్మేవారు.అనంతరం తనకు వచ్చిన వినూత్న ఆలోచనతో మసాలా సంస్థను స్థాపించారు. అలా అంచెలంచెలుగా ఎదిగిన ధర్మపాల్ MDH గ్రూప్ యజమాని స్థాకికి ఎదిగారు.



చిన్న బడ్డీకొట్టుతో ప్రారంభమైన ఆయన వ్యాపారం అనతి కాలంలోనే మసాలా ప్రపంచంలో ఘుమఘుమలాడారు. దిగ్గజ పరిశ్రమ స్థాయికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా MDH మసాలాలు మంచి గుర్తింపుతెచ్చుకున్నాయి. ఏడాదికి రూ.900 కోట్ల టర్నోవర్ తో MDH విదేశాల్లో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరుకుంది. అమెరికా, కెనడా,యూకేలోని ఇంగ్లండ్ , స్కాంట్లాండ్, జపాన్, యూఏఈ, సైదీ అరేబియా వంటి పలు దేశాల్లో MDH మసాలాలుమంచి పేరు తెచ్చుకున్నాయి. పలు దేశాలకు MDH మసాలాలు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం MDH 62 రకాల మసాలాలు ఉత్పత్తి చేస్తోంది.



కేవలం వ్యాపారంలోనే కాకుండా ధర్మపాల్ గులాటీ దానధర్మాల్లో కూడా ముందుండేవారు. సమాజానికి సేవల చేయాలను మంచి ఆలోచనతో ‘మహాశయ్ చున్నీలాల్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. తన జీతంలో 90 శాతం ఆ ట్రస్టుకే వినియోగిస్తారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.


ధర్మాపాల్ గులాటీ మృతికి పలువురు ప్రముఖులు..రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. భారత అత్యుత్తమ వ్యాపారవేత్తల్లో ధర్మాపాల్ గులాటీ ఒకరని కొనియాడారు. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వంటి ప్రముఖులు ధర్మపాల్ కు నివాళులర్పించారు.