Cheteshwar Pujara: అరంగ్రేట మ్యాచ్‌లోనే పూజారా డబుల్ సెంచరీ

వెటరన్ ఇండియన్ బ్యాట్స్‌మన్ ఛతేశ్వర్ పూజారా సస్సెక్స్ అరంగ్రేట మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేసేశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో భాగంగా జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 387 బంతుల

Cheteshwar Pujara: అరంగ్రేట మ్యాచ్‌లోనే పూజారా డబుల్ సెంచరీ

Cheteshwar Pujara

Cheteshwar Pujara: వెటరన్ ఇండియన్ బ్యాట్స్‌మన్ ఛతేశ్వర్ పూజారా సస్సెక్స్ అరంగ్రేట మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ చేసేశాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ 2లో భాగంగా జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 387 బంతులకు 201పరుగులు చేశాడు. ఏప్రిల్ 17న డెర్బీషైర్ తో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.

జనవరి 2019లో చివరి సారిగా సెంచరీ నమోదు చేసిన పూజారా.. అప్పటి నుంచి అవుటాఫ్ ఫామ్ గా కనిపిస్తున్నాడు. ప్రతిసారీ ఈజీ నాక్స్ ఆడినప్పటికీ, అతని ప్రదర్శనలో నిలకడ లోపించింది. అదే కారణంగా ఇతర సీనియర్లు అయిన అజింకా రహానె, ఇషాంత్ శర్మలను గత నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కు తీసుకున్నారు.

కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్రదర్శన కారణంగా జాతీయ జట్టులోకి తిరిగి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన పూజారా.. “నా అరంగ్రేట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాను. టీం సక్సెస్ కోసం చేసి చూపించాలనుకున్నాను. ఆటలో మెరుగైన తీరు కనబరిచేందుకు ప్రయత్నిస్తాను” అని పూజారా పోస్టు పెట్టాడు.

Read Also: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రిజ్వాన్ – పూజారా జోడీపై ట్విట్టర్ కౌంటర్స్

పూజారాతో పాటుగా టామ్ హైన్స్ కూడా డబుల్ సెంచరీ చేసేశాడు. 119 ఓవర్లలో 351పరుగులు నమోదు చేశాడు. చివరికి గేమ్ డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో పూజారాను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.