Invitation Wedding card : అతనిచ్చిన వెడ్డింగ్ కార్డ్ చూసి షాక్ అవుతున్న బంధువులు..

వరుడు ఇచ్చిన ఓ విచిత్రమై వెడ్డింగ్ కార్డ్ చూసి షాక్ అవుతున్న బంధువులు, స్నేహితులు..

Invitation Wedding card : అతనిచ్చిన వెడ్డింగ్ కార్డ్ చూసి షాక్ అవుతున్న బంధువులు..

Invitation Wedding Card

Groom wedding invitation like aadhaar card : ఏ వెడ్డింగ్ కార్డు అయినా దేవుడి బొమ్మలతో బంధువులు,స్నేహితులు అంతా రావాలని కోరుతు ప్రింట్ వేయిస్తారు. మోడల్స్ మారినా వెడ్డింగ్ కార్డ్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ఓ యువకుడి వేయించిన వెడ్డింగ్ కార్డు చూసి బంధువులు, స్నేహితులు షాక్ అవుతున్నారు. వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్లికి తప్పకుండా రండి అని పిస్తుంటే ఆ వెడ్డింగ్ కార్డువైపు నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు.

‘ఏంటిరా..వెడ్డింగ్ కార్డు ఇవ్వకుండా ‘ఆధార్ కార్డ్’ ఇచ్చి పెళ్లికి రమ్మంటున్నావ్’..? అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అతని వెడ్డింగ్ కార్డు ‘ఆధార్ కార్డు’లాగా ఉంది మరి. దానికి సదరు పెళ్లి కొడుకు..అదేం లేదుకాదు..ఇది వెడ్డింగ్ కార్డే ఆధార్ కార్డు కాదు..పెళ్లికి తప్పకుండా రండి అని వినమ్రంగా చెబుతున్నాడు.ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Also read : రైల్వే అధికారి విత్తనాల వెడ్డింగ్ కార్డ్.. మొకలొస్తాయి..పూలు కూడా పూస్తాయి

ఇంతకీ ఎవరా ఆధార్ కార్డు లాంటి వెడ్డింగ్ కార్డు వేయించిన పెళ్లికొడుకు అంటే.. ఛ‌త్తీస్‌ఘ‌డ్‌కు చెందిన లోహిత్ సింగ్ అనే వ్య‌క్తి త‌న పెళ్లికి వెడ్డింగ్ కార్డు వెరైటీగా ప్రింట్ చేయించుకోవాలనుకున్నాడు. పైగా లోహిత్ ఆధార్ కార్డు సెంటర్ కూడా నిర్వహిస్తుంటాడు. అలా ఓ ఐడియా వచ్చిన వెడ్డింగ్ కార్డునే ఆధార్ కార్డుగా మార్చేశాడు.

జాష్‌పూర్ జిల్లాలోని అంకిరా గ్రామానికి చెందిన సింగ్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగి. ఊళ్లో ఆధార్ సెంట‌ర్‌ను కూడా నిర్వ‌హిస్తుంటాడు. త‌న చేసే ప‌ని ఆధార్ కార్డుది కాబ‌ట్టి.. త‌న పెళ్లి ప‌త్రిక‌ను ఆధార్ కార్డు త‌ర‌హాలో ప్రింట్ చేయించాడు. త‌న పెళ్లికి రావాలంటూ అంద‌రికీ ఆధార్ కార్డులా ఉన్న పెళ్లి ప‌త్రిక‌ను ఇస్తున్నాడు.అతని ఇచ్చిన కార్డు చూసినవారు వెంటనే ఇదేంటిరాబాబూ పెళ్లికి రమ్మంటూ ఆధార్ కార్డు ఇస్తున్నావ్? అని ఆశ్చర్యపోతున్నారు.

Also read : వాట్సాప్‌లో పెళ్లి పిలుపు.. గూగుల్‌ మ్యాప్‌లో లొకేషన్‌.. ఫేస్‌బుక్‌లో లైవ్‌