Maoists Couple : పెళ్లి చేసుకోవటానికి పారిపోయిన మావోయిస్టు జంట..వెతికిపట్టుకుని కాల్చి చంపిన కామ్రేడ్స్

ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నక్సల్స్ జంట శిబిరం నుంచి పారిపోయింది. వారిని వెతికి పట్టుకున్న మావోలు దారుణంగా హత్య చేశారు.

Maoists Couple : పెళ్లి చేసుకోవటానికి పారిపోయిన మావోయిస్టు జంట..వెతికిపట్టుకుని కాల్చి చంపిన కామ్రేడ్స్

Maoists Kill Couple In Marriage Plan In Chhattisgarh

Maoists Couple : ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు క్యాంపు నుంచి ఓ జంట పారిపోయింది. ఓ యువతి, యువకుడు పారిపోయారు. నక్సలిజంవైపు అడుగులు వేసి ఉద్యమంలో పాలుపంచుకోవాలని వచ్చిన ఇద్దరు మావోల మధ్య ప్రేమ చిగురించింది. అదికాస్తా మొగ్గతొడిగింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఉద్యమంలో ఉండగా అది సాధ్యం కాదు. అందుకే ఉద్యమం వదిలిపారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అనుకున్నట్లుగా తోటి కామ్రేడ్స్ కు తెలియకుండా రహస్యంగా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మావో నాయకులు వారిని వెతికి వెతికి పట్టుకున్నారు.అనంతరం కిరాతకంగా హత్య చేశారు.

Raai Laxmi : డాల్ఫిన్స్‌తో కలిసి స్విమ్ చేసిన లక్ష్మి‌రాయ్

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ గంగలూరు ఏరియా కమిటీ మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లు పునెం, మిలీషియా సభ్యురాలు మంగి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో గురువారం (జనవరి 6,2022)మావోల క్యాంపు నుంచి పరారయ్యారు. దీంతో మావోయిస్టు క్యాంపులో కలకలం రేగింది. విషయం తెలుసుకున్నారు. వారి కోసం గాలించి..గాలించి చివరికి వెతికి పట్టుకున్నారు. ఆ తరువాత ప్రజాకోర్టు నిర్వహించారు. ప్రజాకోర్టులో వారికి మరణశిక్ష ఖరారు చేశారు. ఆ తరువాత అనుకున్నట్లుగానే వారిని దారుణంగా హత్య చేశారు.

ఈ వివరాలను బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజు తెలిపారు. పునెం 11 మావోయిస్టు సంబంధిత కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అలాగే మంగి పేరు కూడా నేరాలు చేసిన కేసుల్లో ఉంది. మూడు ఘటనల్లో మంగి పేరు పోలీసు రికార్డుల్లో ఉంది.

India Covid Update : భారత్‌లో లక్ష 50 వేలకు చేరువలో కోవిడ్ కేసులు
కాగా..గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగిన ఈ హత్యల గురించి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ మాట్లాడుతు..ప్రాథమిక సమాచారం ప్రకారం వివాహం చేసుకోవాటానికి పారిపోయిన జంటను మావోలు హత్య చేశారని.. ఈ ప్రాంతంలో మరో వ్యక్తి కూడా హత్యకు గురైయ్యాడని..అతనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. అతని మృతదేహాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.