chhattisgarh : కిడ్నాప్‌ అయిన గ్రామస్థుల్ని సురక్షితంగా విడిచిపెట్టిన మావోయిస్టులు

ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఐదుగురు గ్రామస్తుల్ని కిడ్నాప్ చేశాు. తరువాత వారిని సురక్షితంగా విడిచిపెట్టారు.

chhattisgarh : కిడ్నాప్‌ అయిన గ్రామస్థుల్ని సురక్షితంగా విడిచిపెట్టిన మావోయిస్టులు

Chhattisgarh (1)

village people kidnapped by maoists : ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. కొంటా బ్లాక్‌లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను కిడ్నాప్‌ చేశారు. శుక్రవారం (నవంబర్ 5,2021) రాత్రి మారణాయుధాలతో గ్రామానికి వచ్చిన మావోయిస్టులు ఐదుగురు గ్రామస్తులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు.

నక్సల్స్ వద్ద బందీగా ఉన్న వారిని విడిపించడానికి గ్రామస్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. భించారు. వారికి ఏ హాని తలపెట్టకుండా క్షేమంగా విడుదల చేయాలని సర్వ ఆదివాసీ సమాజ్ మావోయిస్టులకు విజ్ఞప్తి చేసింది.‌ దీంతో మరి వారి మధ్య చర్చలు ఏం జరిగాయో తెలీదుగానీ శనివారం నలుగురిని విడిచిపెట్టగా..మరో వ్యక్తిని కూడా విడిచిపెట్టారు.

ఐదుగురి కిడ్నాప్ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.‌ అయితే దీనిని కిడ్నాప్‌ ను గానీ..వారిని విడిచిపెట్టినట్లుగానీ పోలీసులు ధృవీకరించలేదు. దీనిపై స్పందించిన సుక్మా ఎస్‌పి సునీల్ శర్మ గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లుగా మాకు సమాచారం అందలేదనీ..మావోయిస్టులు గ్రామానికి వచ్చి వారిని బలవంతంగా సమావేశానికి తీసుకెళ్ళినట్లుగా తమకు తెలిసిందని తెలిపారు.