Chhattisgarh: స‌ర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన న‌క్స‌లైట్లు

ఛత్తీస్‌గ‌ఢ్‌లో న‌క్స‌లైట్లు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసు ఇన్ఫార్మ‌ర్ నెపంతో ఓ గ్రామ స‌ర్పంచ్‌ను దారుణంగా హ‌త్య చేశారు.

Chhattisgarh: స‌ర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన న‌క్స‌లైట్లు

Chhattisgarh: ఛత్తీస్‌గ‌ఢ్‌లో న‌క్స‌లైట్లు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసు ఇన్ఫార్మ‌ర్ నెపంతో ఓ గ్రామ స‌ర్పంచ్‌ను దారుణంగా హ‌త్య చేశారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు ఇవాళ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తోయ్‌న‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మోర్మ‌ద్ గ్రామ స‌ర్పంచ్ రాతిరామ్ కుడియం (36) అనే స‌ర్పంచ్‌పై న‌క్స‌లైట్లు గ‌త రాత్రి దాడి చేశారు. మొద‌ట ఆయ‌న ఇంట్లోకి దూసుకెళ్ళిన న‌క్స‌లైట్లు తాడుతో గొంతును బిగించి, ఊపిరి ఆడ‌కుండా చేసి చంపారు.

Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఇవాళ ఉద‌యం ఆయ‌న ఇంటికి వెళ్ళారు. ఆయ‌న మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఆ స‌ర్పంచ్ పోలీసుల‌కు ఇన్ఫార్మర్‌గా ప‌నిచేస్తున్నాడ‌న్న అనుమానంతోనే న‌క్స‌లైట్లు ఈ ఘాతుకానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హ‌త్య‌పై త‌దుప‌రి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.