Chicken flying: ఆమె పిలుపుకు గాల్లో పక్షుల్లా ఎగిరి వచ్చేస్తున్న కోళ్లు..!

ఆమె పిలుపుకు కోళ్లు గాల్లో పక్షుల్లా ఎగిరి వచ్చేస్తున్నాయి..!

Chicken flying: ఆమె పిలుపుకు గాల్లో పక్షుల్లా ఎగిరి వచ్చేస్తున్న కోళ్లు..!

Chicken Flying (1)

Chicken flying: కోడి పక్షి జాతికి చెందినదే కానీ అది గాల్లో ఎంతో దూరం ఎగరలేదు. అలా గాల్లో ఎగరలేని పక్షుల్లో బాతులు, కోళ్లు,నెమళ్లు, ఈము,నిప్పుకోడితో పాటు మరికొన్ని జాతి పక్షులు గాల్లో ఎక్కువదూరం ఎగరలేవు. వాటికి రెక్కలు ఉన్నాయి..కానీ ఎగరలేవు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం కోళ్లన్నీ కాకి, పిచ్చు, పావురాలులాగా ఎగురుతున్నాయి. కోళ్లన్నీ గాల్లో ఎగురుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

వైరల్ అవుతున్న ఈ వీడియో పౌల్ట్రీ ఫారానికి చెందినదిగా తెలుస్తోంది. ఇక్కడ పని చేసే ఒక మహిళ కోళ్లకు ఆహారం వేస్తోంది. కానీ మన పౌల్ట్రీల్లాగా అక్కడ షెడ్డుల్లో లేవు. ఓపెన్ ప్లేసులో ఉన్నాయి వందలాది కోళ్లు. ఆ కోళ్లన్నీ పచ్చని కొండల్లో మేత కోసం వెళ్లాయి. మన ఊర్లలో ఇళ్లల్లో పెంచుకునే కోళ్లలాగా ఆరుబయట మేతకు వెళ్లాయి. అలా మేతకు వెళ్లిన కోళ్లను ఓ మహిళ ఆహారం కోసం పిలిచేందుకు ఓ ప్లెట్‌ మీద ఓ కట్లె పట్టుకుని శబ్దం వచ్చేలా వాయించింది.

ఆ తర్వాత వెంటనే కిందకు తల వంచుకుని వేగంగా పక్కకు వెళ్లిపోతుంది. ఆ వెంటనే దూరం నుంచి కోళ్ల మంద గాల్లో పక్షుల్లా ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. వాటి వేగం చూస్తుంటే..పక్షులను మించిపోయినట్లుగా ఉంది. ఆమె గనుక అక్కడే నిలబడి ఉండి ఉంటే.. ఖచ్చితంగా ఆమె కోళ్ల కాళ్లకు తగిలి గాయపడి ఉండేది..ఆ విషయం ఆమెకు తెలుసు..ఎందుకంటే ఆమె ప్రతీరోజు కోళ్లను అలాగే పిలుస్తుంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కోళ్ల ఇంత వేగంగా, ఇంత ఎత్తులో కూడా ఎగరగలవా? అనుకుంటున్నారు.