Lucknow : టీచర్ అమానుషం.. చెప్పుతో పలుమార్లు కొట్టడంతో మానసికంగా కుంగిపోయిన చిన్నారి..
లక్నోలో ఓ స్కూల్ టీచర్ విద్యార్ధిని పట్ల అమానుషంగా ప్రవర్తించింది. పలుమార్లు చిన్నారిని చెప్పుతో కొట్టడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Lucknow
Lucknow News : పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ ఓ చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. 7 ఏళ్ల బాలికను పలుమార్లు చెప్పుతో కొట్టడంతో ఆ చిన్నారి మానసికంగా కుంగిపోయింది. టీచర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viral Video : అమేజింగ్ టాలెంట్.. డ్యాన్స్ ఇరగదీసిన టీచర్.. వీడియో వైరల్
అలంబాగ్‌లోని సుందర్‌నగర్‌లో నివాసం ఉంటోంది 7 ఏళ్ల బాలిక కుటుంబం. వారం రోజులుగా చిన్నారి స్కూలుకి ససేమిరా వెళ్లనంది. క్లాస్ టీచర్ తనను చాలాసార్లు చెప్పుతో కొట్టిందని ఆ బాలిక ఆరోపించింది. ఆమె మానసిక పరిస్థితి కూడా బాగా లేనట్లు గుర్తించిన తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని సంప్రదించారు. వారి నుంచి సరైన సహాయం లభించకపోవడంతో చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షలకు పంపారు. గాయాలకు సంబంధించిన వివరాలు రిపోర్టులో తేలాల్సి ఉంది. ఇక స్కూలు టీచర్ నిర్వాకానికి భయపడి బాధిత చిన్నారితో పాటు అదే స్కూల్లో చదువుకుంటున్న తమ మరో ఇద్దరు కూతుళ్లు స్కూలుకి వెళ్లడానికి భయపడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిపట్ల అమానుషంగా ప్రవర్తించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.