Children’s Friendship : పిల్లల స్నేహం…పెద్దల మార్గనిర్ధేశం..

పదేపదే పిల్లలకు నువ్వు క్రమశిక్షణతో ఉండాలి. మేం చెప్పినట్లు వినాలి అంటూ బెదిరింపు ధోరణితో చెప్పటం వల్ల మొండిగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి.

Children’s Friendship : పిల్లల స్నేహం…పెద్దల మార్గనిర్ధేశం..

Children (2)

Children’s Friendship : తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, వారి సక్రమైన నడవడిక విషయంలో పర్యవేక్షణ అనేది ముఖ్యమైన బాధ్యత. వారు పెరిగే వాతావరణం.. నడిచే నడత, స్నేహితుల ప్రభావం వెరసి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఇదే విషయాన్ని మానసిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. చిన్నానాటి నుండే ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించకుంటే మాత్రం పిల్లల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

చిన్ననాటి నుండే పిల్లలు, ఇంటి పరిసర వాతావరణంలో ఉండే పిల్లలు, లేదంటూ పాఠశాలలో ఉండే తోటి పిల్లలో కలివిడిగా ఉంటున్నారా లేదా అన్న విషయాన్ని గమనించాలి. తోటి పిల్లలతో స్నేహం అవసరతను, మిత్రులతో చెలిమి వల్ల ఎంత ఆనందం కలుగుతుందో వారికి తెలియజెప్పాలి. అబద్ధాలు చెప్పటం, దొంగతనాలు చేయటం వంటి అలవాట్లు ఎంత ప్రమాదమో చెప్పి అలాంటి అవలక్షణాలు కలిగిన వారితో సాన్నిహిత్యం మంచిదికాదని సూచించాలి.

మంచివారితో స్నేహం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తల్లిదండ్రులు పిల్లలకు వివరించి చెప్పాలి. మోసకారులతో స్నేహం చేయటం వల్ల చివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చిన్నచిన్న నీతి కధల ద్వారా వారికి చెప్తే త్వరగా వారు అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్నారులు చదువులో వెనక బడి ఉంటే వారిని వెన్ను తట్టి ప్రోత్సహించాలి. చదువులో, ఆటల్లో వెనుకబడితే ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అవసరమైతే పిల్లల స్నేహితులతో మాట్లడం వల్ల ఫలితం ఉంటుంది.

పిల్లల స్నేహితులతో తల్లిదండ్రులుగా మీరు కలివిడిగా, చొరవగా ఉండండి. అయితే పదేపదే మీపిల్లలను పక్క పిల్లలతో పోల్చుతూ వారికంటే తెలివి తక్కువగా ఉన్నావని, చదువులో వెనకబ్డావని చులకనగా మాట్లాడటం మంచిది కాదు. తెలివి తేటలు విషయంలో ఎవరు సామర్ధ్యాలు వారికుంటాయన్న విషయం గుర్తుంచుకోండి. స్నేహానికి మనస్తత్వం కలవటం మాత్రమే ముఖ్యం తప్ప ఇతర విషయాలు కాదు.

పదేపదే పిల్లలకు నువ్వు క్రమశిక్షణతో ఉండాలి. మేం చెప్పినట్లు వినాలి అంటూ బెదిరింపు ధోరణితో చెప్పటం వల్ల మొండిగా మారే అవకాశాలు అధికంగా ఉంటాయి. చివరకు వారు పెంకి ఘటాలు గా మారిపోతారు. అలా కాకుండా మంచి ఏదో, చెడు ఏదో వారికి అర్ధమయ్యేలా నీతి సూత్రాలు, కధల రూపంలో చిన్న బుర్రల చెప్పాలి.

స్నేహితులతో చిన్నచిన్న గిల్లి కజ్జాలు, కొట్లాటలు జరిగిన సందర్భాల్లో ఇవురిని పిలిచి విషయం తెలుసుకుని తప్పుఒప్పులను స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాటిని వారు సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా వ్యవహరిస్తే మీ చిన్నారులకు మంచి స్నేహసంబంధాలను కొనసాగించేందుకు మార్గం ఏర్పడుతుంది.