China: ఐరాసలో భార‌త ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకున్న చైనా

పాకిస్థాన్ ఉగ్ర‌వాది అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కీని ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించేందుకు భార‌త్ చేసిన ప్ర‌య‌త్నాల‌కు చివ‌రి నిమిషంలో చైనా(China:) అడ్డుత‌గిలింది.

China: ఐరాసలో భార‌త ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకున్న చైనా

Rajnath Singh If Harmed, India Won't Spare Anyone Rajnath Singh's Message To China (1)

China: పాకిస్థాన్ ఉగ్ర‌వాది అబ్దుల్ రెహ్మాన్ మ‌క్కీని ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించేందుకు భార‌త్ చేసిన ప్ర‌య‌త్నాల‌కు చివ‌రి నిమిషంలో చైనా అడ్డుత‌గిలింది. మ‌క్కీని ఇప్ప‌టికే అమెరికా ఉగ్ర‌వాదిగా గుర్తించింది. అత‌డు ల‌ష్క‌రే తోయిబా చీఫ్‌, 26/11 ముంబై వ‌రుస పేలుళ్ళ సూత్ర‌ధారి హఫీజ్ స‌యీద్‌కి బావ మ‌రిది అవుతాడు.

Agnipath: హైద‌రాబాద్ మెట్రో రైళ్ళు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు

ఐరాస భ‌ద్ర‌త మండ‌లిలోని ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్ష‌ల క‌మిటీ మ‌క్కీని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించాల‌ని భార‌త్‌, అమెరికా ప్ర‌తిపాదించాయి. అయితే, చివ‌రి నిమిషయంలో చైనా అభ్యంత‌రాలు తెలుపుతూ ఆ ప్ర‌తిపాద‌న‌ను నిలిపివేసింది. గ‌తంలోనూ ప‌లుసార్లు పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల విష‌యంలో భార‌త్ చేసిన ప‌లు ప్ర‌య‌త్నాల‌ను చైనా అడ్డుకుంది. 2019లో మాత్రం జైషే మొహ‌మ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించేందుకు భార‌త్ చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌య్యాయి.