చైనా మరో కుట్ర : హిందూ మహాసముద్రంలో అండర్ వాటర్ డ్రోన్లతో మోహరించింది

చైనా మరో కుట్ర : హిందూ మహాసముద్రంలో అండర్ వాటర్ డ్రోన్లతో మోహరించింది

China deploying underwater drones in Indian Ocean : కయ్యాల మారి చైనా.. మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో ఇండియాను ఎదుర్కోవడం చేతకాని డ్రాగన్.. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో నుంచి కయ్యానికి కాలు దువ్వుతోంది. మరో కుట్రకు ప్రయత్నించి చైనా అడ్డంగా దొరికిపోయింది. హిందూ మహాసముద్రంలోకి అండర్ వాటర్ డ్రోన్లతో చైనా మోహరించింది. హిందూ మహాసముద్రంలో Sea Wing (Haiyi) గ్లైడర్ అని పిలిచే నీటి అడుగున నడిచే డ్రోన్లతో చైనా మోహరించింది. ఈ ప్లీట్ నెలల తరబడి నీటి అడుగున పనిచేయగలదని రక్షణ విశ్లేషకులు హెచ్ఐ సుట్టన్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. ఈ గ్లైడర్లతో నావికాదళ ఇంటెలిజెన్స్ ప్రయోజనాల కోసం ఆపరేట్ చేయగలదని సుట్టన్ పేర్కొన్నారు.

పెద్ద సంఖ్యలో మోహరించగల సామర్థ్యం ఉన్న ఈ సముద్ర గ్లైడర్లు.. ఒక రకమైన అన్‌క్రూవ్డ్ అండర్వాటర్ వెహికల్ (UUV).. 2019 డిసెంబర్ మధ్యలోకాలంలో దీన్ని ఆవిష్కరించారు. 3,400 టెస్టింగ్‌ల తరువాత ఈ గ్లెడర్లను సిద్ధం చేశారు. ఈ గ్లైడర్లు అమెరికా నేవీ మోహరించిన వాటితో సమానమైనవనిగా సుట్టన్ అభిప్రాయపడ్డారు. ఈ సముద్ర డ్రోన్లలో ఒకటి ప్రయాణించే నౌకల సురక్షిత నావిగేషన్‌ను నిర్ధారించడానికి 2016లో బీజింగ్ స్వాధీనం చేసుకుంది.

చైనా ఇప్పుడు హిందూ మహాసముద్రంలో ఈ రకమైన UUVని భారీగా మోహరిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఆర్కిటిక్‌లోని ఐస్ బ్రేకర్ నుంచి చైనా కూడా సీ వింగ్‌ను మోహరించిందని సుట్టన్ స్పష్టం చేశారు. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ నెలలో హిందూ మహాసముద్రం మిషన్‌లో చైనా 14 మందిని నియమించనున్నట్లు తెలిసినప్పటికీ 12 మంది మాత్రమే ఉన్నట్టు తెలిసింది. హిందూ మహాసముద్రంలో ఉంచిన ఈ చైనీస్ గ్లైడర్లు సముద్ర శాస్త్ర డేటాను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా ఎన్ని ఎత్తులు వేసినా భారత్ తలచుకుంటే పలాయనం చిత్తగించాల్సిందే అంటున్నారు.