పాక్ డ్రిల్…గుజరాత్ సరిహద్దులో చైనా యుద్ధ విమానాలు,దళాలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2020 / 12:03 AM IST
పాక్ డ్రిల్…గుజరాత్ సరిహద్దులో చైనా యుద్ధ విమానాలు,దళాలు

China dispatches warplanes, troops for Pak drill at base close to India border భారత సరిహద్దుకు స‌మీపంలో ఉన్న ఎయిర్ బేస్‌లో సైనిక ‌విన్యాసాలు చేప‌ట్టాల‌ని పాకిస్థాన్ నిర్ణ‌యించింది. ఈ నేపథ్యంలో చైనా తన ఫైటర్ జెట్స్ ని,ట్రూప్స్ ని గుజరాత్ సరిహద్దుకి సమీపంలోని పాకిస్తాన్ ఎయిర్ బేస్ కి పంపించింది.

ద్వైపాక్షిక సైనిక విన్యాసాల లెటెస్ట్ ఎడిషన్ లో పాల్గొనేందుకు త‌మ యుద్ధ విమానాలను, దళాలను పంపిన‌ట్లు చైనా సైన్యం సోమ‌వారం ప్ర‌క‌టించింది. వైమానిక దళం విన్యాసాలు ఇరు దేశాల దళాల వాస్తవ పోరాట శిక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఉద్దేశించినదని తెలిపింది.



పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన ప్రకటనలో…చైనా-పాకిస్తాన్ ఉమ్మడి వైమానిక దళం వ్యాయామం షాహీన్ (ఈగిల్) – IX లో పాల్గొనేందుకు సింధ్ లోని థాటా జిల్లాలోని భలోరిలోని పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేస్ కి చైనా ఎయిర్ ఫోర్స్ దళాలు డిసెంబర్-7న పంపబడ్డాయని తెలిపింది.



అయితే, ఈ డ్రిల్ ఎప్పుడు మొద‌ల‌వుతుందో మాత్రం చెప్ప‌లేదు. అలాగే ఎప్పుడు ముగుస్తుందో కూడా స్ప‌ష్టంగా చెప్ప‌కుండా డిసెంబ‌ర్ చివ‌ర‌లో విన్యాసాలు ముగుస్తాయ‌ని మాత్ర‌మే ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కాగా, తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంట కొనసాగుతున్న భారత్-చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో తాజా విన్యాసాలు జరుగుతున్న‌ట్లు ప‌లువురు భావిస్తున్నారు.