China U turn: జనాభా నియంత్రణపై చైనా యూటర్న్.. ఇప్పుడు ఎక్కువ మందిని కంటే బహుమతులు

2016లో ఒక బిడ్డ నిబంధనను ఉపసంహరించుకున్న చైనా.. ఏడాది క్రితం ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవడంతో మరో ముందడుగు వేయక తప్పలేదు. మంగళవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో.. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. రాయితీలు, పన్ను రిబేట్లు, మెరుగైన ఆరోగ్య బీమా, విద్య, గృహ నిర్మాణం, ఉద్యోగాలు వంటివాటిలో రాయితీలను కల్పించాలని నేషనల్ హెల్త్ కమిషన్ సిఫారసు చేసింది.

China U turn: జనాభా నియంత్రణపై చైనా యూటర్న్.. ఇప్పుడు ఎక్కువ మందిని కంటే బహుమతులు

China Encourages Couples to Have More Children

China U turn: చైనా అంటే అధిక జనాభా కలిగిన దేశంగానే కాకుండా, జనాభా నియంత్రణలోనూ కఠినాత్మకంగా వ్యవహరించే దేశంగా ప్రపంచం మొత్తానికి తెలుసు. జనాభా నియంత్రణ కోసం ‘వన్ ఆర్ నన్’ అనే పాలసీని చైనా ఎంత కఠినంగా అమలు చేసిందో గతంలో, ఇప్పటి జనాభా లెక్కలు చూస్తే అర్థమవుతోంది. అయితే ఉన్నట్టండి ఈ విధానికి చైనా పూర్తి యూ టర్న్ తీసుకుంది. అంటే ఒక్కరి కంటే ఎక్కువ మందిని కనకూడదని కఠిన ఆంక్షలు విధించిన చైనాయే.. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కంటే బహుమతులు ఇస్తామని అంటోంది.

కారణం.. చైనాలో జనాభా నానాటికీ తగ్గిపోతోంది. వృద్ధ జనాభా ఎక్కువైంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం ‘వన్ ఆర్ నన్’ పాలసీలో మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎక్కువ మంది పిల్లల్ని కనడంపై చైనీయులు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగాలకు సరిపడా యువతరం లేదు. ఉత్పత్తి తగ్గుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉన్న చైనాకు ఇది పెద్ద అవరోధంగా తయారు కానుంది. దీంతో ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి చైనా ‘యూ’ టర్న్ తీసుకోక తప్పలేదు.

గత ఐదేళ్లుగా దేశంలో జనాభా పెద్ద స్థాయిలో తగ్గింది. 2016లో ఒక బిడ్డ నిబంధనను ఉపసంహరించుకున్న చైనా.. ఏడాది క్రితం ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కూడా పెద్దగా ప్రయోజనం ఇవ్వకపోవడంతో మరో ముందడుగు వేయక తప్పలేదు. మంగళవారం చైనా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో.. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. రాయితీలు, పన్ను రిబేట్లు, మెరుగైన ఆరోగ్య బీమా, విద్య, గృహ నిర్మాణం, ఉద్యోగాలు వంటివాటిలో రాయితీలను కల్పించాలని నేషనల్ హెల్త్ కమిషన్ సిఫారసు చేసింది. ప్రత్యుత్పాదక ఆరోగ్యం, బాలల సంరక్షణ సేవల మెరుగుదలకు వ్యయాన్ని దేశవ్యాప్తంగా పెంచాలని సెంట్రల్, ప్రొవిన్షియల్ ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. యువ కుటుంబాలకు మద్దతుగా నిలవాలని తెలిపింది.

చైనాలో గత సంవత్సరం 1000 మంది ప్రజలకు జననాల రేటు 7.52కు తగ్గిపోయింది. జననాలను నమోదు చేయడం ప్రారంభమైనప్పటి నుంచి (1949 నుంచి) ఇదే అతి తక్కువ జననాల రేటు. జనాభా విషయంలో చైనా తర్వాతి స్థానంలో ఉన్న మన దేశం.. మరి కొద్ది కాలంలో చైనాను అధిగమించి మొదటి స్థానంలోకి రాబోతోంది. 2050 వరకు భారత్‭లో జనాభా పెరుగుతూ పోతుందని, ఆ తర్వాత నియంత్రణ వైపుకు వెళ్తుందని కొద్ది రోజుల క్రితం ఒక అధ్యయనం తెలిపింది.

minister audio leak: కర్ణాటక మంత్రి ఆడియో లీక్.. చిక్కుల్లో ప్రభుత్వం