Ghost Marriages: 3,000 ఏళ్లుగా దెయ్యానికి పెళ్లి చేసే ఆచారం..! ఆన్ లైన్ లో ఇదో వ్యాపారం..!!

3,000 ఏళ్లుగా దెయ్యానికి పెళ్లి చేసే ఆచారం కొనసాగుతోంది. దెయ్యం పెళ్లి కోసం శ్మసానంలో దొంగతనాలు ఆన్ లైన్ లో ఇదో వ్యాపారం..!!

Ghost Marriages: 3,000 ఏళ్లుగా దెయ్యానికి పెళ్లి చేసే ఆచారం..! ఆన్ లైన్ లో ఇదో వ్యాపారం..!!

Ghost Marriages

Ghost Marriages in China: దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనేది పెద్ద ప్రశ్నే. ఇవి ఉన్నాయో లేవో అనే విషయం పక్కన పెడితే ‘దెయ్యం కంటే భయం మా చెడ్డది భయ్యా’. ఈక్రమంలో దెయ్యాల పెళ్లి గురించి తెలుసుకుందాం.దెయ్యాలు ఉన్నాయా?లేవా?అనేదే పెద్ద ప్రశ్నగా ఉంటే దెయ్యాల పెళ్లి ఏంటీ? ఇదేం తిరకాసు? అని అనుకుంటున్నారా? దెయ్యం ఉందని నమ్మేవాళ్లు నమ్ముతారు. నమ్మనివాళ్లు నమ్మరు. ఎవరు ఏమనుకున్నాగానీ దెయ్యాలకు మేం పెళ్లి చేస్తాం అంటున్నారు చైనా వాసులు. టెక్నాలజీలో చైనా ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాగానీ..చైనీయులకు మూఢనమ్మకాలు ఎక్కువే. ఆ నమ్మకంతోనే గత 3,000 ఏళ్లనుంచి దెయ్యాలకు పెళ్లి చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు చైనాలో.

Read more : Viral Video : జిమ్‌లో దెయ్యం….భయంతో పారిపోయిన వ్యక్తి

దెయ్యానికి పెళ్లేంటి? ఎలా చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. దానికి ముందు మీకో విషయం చెప్పాలి.చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన లైవ్ స్ట్రీమర్ అయిన ఓ యువతి గత అక్టోబర్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యింది. ఆమెకు పెళ్లి కాలేదు. ఆమె ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే వైరల్ అయ్యాయి. పాయిజన్  బాటిల్‌ను పట్టుకుని, నెలల తరబడి డిప్రెషన్‌తో బాధపడుతున్న తనకు లైవ్ స్ట్రీమింగ్ షోనే చివరిదని ఆమె తన అనుచరులకు చెప్పిందట. అలా పెళ్లికానివారు ఆత్మహత్య చేసుకుంటే ప్రేతాత్మలవుతారని నమ్ముతారు. వారి ఆత్మలు అశాంతితో కోపంతో రగిలిపోతాయని కొందరు నమ్ముతారు. అలాంటి ఆత్మలకు పెళ్లి చేయడం ద్వారా శాంతిస్తాయన్నది చైనాలో ఓ నమ్మకముంది. అందుకే పెళ్లి కాకుండా చనిపోయినవారికి అంటే వారు ఆత్మలయ్యారని నమ్ముతారు. అలా పెళ్లికాకుండా చనిపోయినవారికి రెండు ఆత్మల అస్థికలు తీసుకొని… వాటితో ఏవో మంత్రపూజలు చేసి… పెళ్లి జరిపిస్తారు. నమ్మకపోయినా ఇది వారి నమ్మకం. ఆ నమ్మకమే వారి ఆచారంగా మారింది. 3000 ఏళ్లుగా ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు చైనాలో కొంతమంది.

Read more : Ghost in House : ఇంట్లోనే తిరుగుతున్న ‘దెయ్యం’..సీసీటీవీలో చూసిన యజమాని

ఆత్మహత్య చేసుకున్న సదరు యువతి ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు నుంచి సోషల్‌ మీడియాలో విషాదకర మాటలు మాట్లాడుతూ… అటువంటి పోస్టులే పెట్టింది. చనిపోయే ముందు రోజు పెట్టిన వీడియోలో కూడా అదే తన చివరి వీడియో కావచ్చు అని తెలిపింది. అక్టోబర్ 15న ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు అందిస్తుండగా పాయిజన్ తాగి చనిపోయినట్లు చైనా మీడియా రిపోర్టులు తెలిపాయి. లక్షల మంది అభిమానులు ఉండీ.. ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఎవరికీ అర్ధంకాలేదు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపారు. కానీ..స్మశానంలో పనిచేసే ఓ వ్యక్తి… ఆమె అస్థికలను దొంగిలించి.. ఎవరికో అమ్మేశాడని తెలిసింది. అలా ఎందుకు చేశాడని ఆరా తీస్తే..ఆమె అస్థికలను కొన్నవారు వాటి ద్వారా మరో దెయ్యం పెళ్లి చెయ్యించారని తెలిసింది. ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అలా దెయ్యాల పెళ్లి సంప్రదాయం గురించి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇంటర్నెట్ లో దెయ్యాల వివాహాలు చేసేవారు ఆమెను ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించారని..ఆమె వారి మాయలో పడి ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు.

Read more : Ghost in Bar: బార్‌లో దెయ్యం.. బీర్ గ్లాస్ పడేసిందంటూ గగ్గోలు

చైనాలో దెయ్యాలకు పెళ్లి చేసే ఈ వింత ఆచారం 3,000 ఏళ్లుగా కొనసాగుతోందట. సాధారణంగా ఇటువంటి పెళ్లిళ్లను చనిపోయిన వారి తల్లిదండ్రులు జరిపిస్తుంటారు. వారే చనిపోయిన వారికి జంట కోసం మరో ఆత్మను వెతుకుతారు. ఆ తర్వాత తంతును మంత్రగాళ్లు చేస్తారు. చైనా కొన్ని దశాబ్దాలకు పూర్వమే దీన్ని నిషేధించింది. అయినా ఇది రహస్యంగా కొనసాగుతోంది. ఇప్పుడైతే… ఈ దెయ్యాల పెళ్లి ఆన్‌లైన్‌ బిజినెస్‌గా మారిపోయింది. దటీజ్ టెక్నాలజీ యుగంలో పాతకాలపు ఆచారాల పర్వం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జోడీ ఆత్మకి సంబంధించిన అస్థికలను కూడా అమ్మేస్తున్నారని తెలిసింది. చైనా అమ్మాయి అస్థికల్ని దొంగిలించాక… వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు కేటుగాళ్లనూ పోలీసులు అరెస్టు చేశారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.