Asian Cup: ఫుట్‌బాల్ ఆసియన్ కప్ నిర్వహణ వదులుకున్న చైనా

వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఫుట్‌బాల్ ఆసియన్ కప్ నిర్వహణ హక్కులను చైనా వదులుకుంది. ఆసియన్ ఫుట్‌బాల్ కన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) శనివారం ఈ విషయాన్ని నిర్ధరించింది.

Asian Cup: ఫుట్‌బాల్ ఆసియన్ కప్ నిర్వహణ వదులుకున్న చైనా

Asian Cup

Asian Cup: వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఫుట్‌బాల్ ఆసియన్ కప్ నిర్వహణ హక్కులను చైనా వదులుకుంది. ఆసియన్ ఫుట్‌బాల్ కన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) శనివారం ఈ విషయాన్ని నిర్ధరించింది. ఫుట్‌బాల్ ఆసియన్ కప్.. ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఫుట్‌బాల్ టోర్నమెంట్. ఆసియా ఖండానికి చెందిన దాదాపు 24 దేశాలు ఇందులో పాల్గొంటాయి. వచ్చే ఏడాది జూన్ 16 నుంచి జూలై 16 వరకు, చైనాలోని పది నగరాల్లో ఈ టోర్నమెంట్ జరగాల్సి ఉంది.

China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..

అయితే, చైనాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు విజృంభిస్తున్న దృష్ట్యా, వచ్చే ఏడాది ఈ టోర్నమెంట్ నిర్వహించలేమని చైనా చెప్పింది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా ప్రకటించింది. కోవిడ్ వల్ల కొంతకాలంగా అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఈ కోవలో ఫుట్‌బాల్ ఆసియన్ కప్-2023 కూడా చేరింది. ఈ టోర్నమెంట్ తిరిగి ఎప్పుడు, ఎక్కడ నిర్వహించేది త్వరలో చెబుతామని ఏఎఫ్‌సీ తెలిపింది. కాగా, చైనాలో జరగాల్సిన ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా వాయిదాపడ్డాయి. కోవిడ్ విషయంలో చైనా కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.