చైనాని వేధిస్తున్న మగాళ్ల కొరత, అబ్బాయిలను మగాడిలా తీర్చిదిద్దడంపై స్పెషల్ ఫోకస్

చైనాని వేధిస్తున్న మగాళ్ల కొరత, అబ్బాయిలను మగాడిలా తీర్చిదిద్దడంపై స్పెషల్ ఫోకస్

China promotes education drive to make boys more manly: చైనాకి కొత్త సమస్య వచ్చింది. అదేమిటంటే మగాళ్ల కొరత. అదేంటి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన చైనాలో మగాళ్ల కొరత రావడం ఏంటి అనే సందేహం రావొచ్చు. నిజమే, అక్కడ పురుషుల సంఖ్యకి వచ్చిన సమస్య ఏమీ లేదు. మరి సమస్య ఏంటంటే, అచ్చమైన మగాళ్లు కరువయ్యారు. బలంగా, ధృడంగా, ఫిట్ గా కనిపించే మగాళ్ల సంఖ్య తగ్గిపోయింది. అబ్బాయిల్లో స్త్రీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మాయిల మాదిరి అబ్బాయిలు కనిపిస్తున్నారు. చాలా నాజుగ్గా, సుకుమారంగా అయిపోతున్నారు. ఇది చైనా ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది. అబ్బాయిలను మగాళ్లలా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఎడుకేషన్ డ్రైవ్ చేపట్టింది.

TF Boys are known as some of China's 'little fresh meats'

ప్రస్తుతం చైనాలో పాపులర్ రోల్ మోడల్స్ అంతా వీక్ అయిపోయారు. అథ్లెట్స్ పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. బాగా బలహీనులయ్యారు. వారిలో స్ట్రెంత్ తగ్గింది. మునపటిలా స్ట్రాంగ్ గా లేరు. ప్రెసిడెంట్ జిన్ పింగ్ సైతం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. మెరుగైన స్పోర్ట్స్ స్టార్స్ ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యా శాఖ ఓ నోటీస్ జారీ చేసింది. బాలురను మరింత మగాడిలా తీర్చిద్దేలా విద్యను అందించాలంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలని, టీచర్ల నియామకాన్ని పటిష్టం చేయాలని నోటీసుల్లో తెలిపింది. అబ్బాయిలు అమ్మాయిల్లా కాకుండా మగాడిలా కనిపించేలా చేయాలంది.

రిటైర్డ్ అథ్లెట్స్, స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారిని స్కూల్స్ లో ఫిజికల్ ట్రైనర్లుగా రిక్రూట్ చేయాలని నోటీసుల్లో తెలిపారు. ఫుట్ బాల్ లాంటి క్రీడల్లో రాణించేలా అబ్బాయిలను తీర్చిదిద్దాలని చెప్పారు.

అబ్బాయిలు నాజుగ్గా, సుకుమారంగా తయారవడానికి.. ఇంట్లో పరిస్థితులే కారణం అని నిపుణులు అంటున్నారు. చాలా ఇళ్లలో అబ్బాయిలు వారి తల్లులు లేదా అమ్మమ్మల దగ్గర పెరుగుతున్నారని చెప్పారు. ఇక చాలామంది తమ పిల్లలను ఆర్మీలోకి పంపకూడదనే భావనతో వారిని నాజుగ్గా పెంచుతున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ ఎడుకేషన్ అందేలా స్కూళ్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.