విమానాల్లో టాయిలెట్లు వాడొద్దు..డైపర్లు వేసుకోండి

  • Published By: madhu ,Published On : December 11, 2020 / 10:05 AM IST
విమానాల్లో టాయిలెట్లు వాడొద్దు..డైపర్లు వేసుకోండి

Wear Diapers : కరోనా ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వివిధ దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వచ్చిన వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. చైనాలో అత్యధికంగా కేసులు నమోదు కావడం..మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. దీంతో ఆ దేశం కఠిన ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ కారణంగా..కుదేలైన పలు రంగాలు..దారిన పడుతున్నాయి. ఇందులో ప్రజా రవాణా ప్రముఖమైంది. లాక్ డౌన్ కారణంగా..నిలిచిపోయిన విమాన సర్వీసులను చాలా దేశాలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు విమాన సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి చైనా విమానయాన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.



కరోనా సోకకుండా ఉండేందుకు..సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. ప్రధానంగా..విమాన సిబ్బంది…వాష్ రూంలు వినియోగించవద్దని, దీనికి బదులుగా డైపర్లు వినియోగించాలని సూచించింది. 500కు పైగా వైరస్‌ కేసులు రికాైర్డెన దేశాలకు ప్రయాణించే విమానాల్లోని సిబ్బంది ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని పేర్కొంది. అలాగే…మాస్క్ లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి అని, కళ్లద్దాలు పెట్టుకోవాలని సూచించింది. పీపీఈ కిట్లు ధరించాలని, బూట్లకు కవర్లు తొడగాలని ఆ ఉత్వర్వుల్లో వివరించింది. టోపీలు, షూ కవర్లు కూడా ధరించాలని సూచించింది.