పెద్ద గాలి బుడగలో 783 గాలి బుడగల్ని దాచేసి ఘనుడు : ఎలా చేశావయ్యా బాబూ..

పెద్ద గాలి బుడగలో 783 గాలి బుడగల్ని దాచేసి ఘనుడు : ఎలా చేశావయ్యా బాబూ..

china man Wonder bubbles Feat  : చిన్నప్పుడు నీళ్లల్లో సబ్బు కలిపి గాల్లో బుడగలు ఊది వాటిని తెగ మురిసిపోయి బాల్యస్మృతులు గుర్తున్నాయా? నా బుడగ పెద్దది..నేను ఎక్కువ బుడగలు ఊదాననే అల్లరి తగవులు పెట్టుకున్న చిన్ననాటి గుర్తులు ఎన్నటికీ మరచిపోలేం కదూ..కానీ అలా ఊదిన బుడగలు వెంటనే పగిలపోయేవి. అప్పుడు మనకెంత బాధ కలిగేదో కదా..ఎంతో ముచ్చటపడి ఊదిన ఆ బుడగలు అలా ఉండిపోతే ఎంత బాగుటుందో అనుకునేవాళ్లం. ఇదిగో ఈ చైనా యువకుడు అటువంటి ఘనతే చేశాడు.

బుస్సు బుస్సు మంటూ ఏకంగా 783 బుడగల్ని ఊదాడు. ఆ బుడగలన్నీ మనం ఊదినవాటిలాగా పగిలిపోలేదు. పైగా ఆ బుడగల్ని ఆ చైనా అబ్బాయి మరో పెద్ద బుడగలో దాచి పెట్టేశాడు. ఏదో రబ్బరు బాల్స్ ని దాచినట్లుగా..అసలు గాలిబుడగల్ని సాధ్యం అవుతుందా? కాదు కదూ..కానీ ఈ చైనా అబ్బాయి మాత్రం ఆ బుడగలన్నీంటినీ ఓ పెద్ద బుడగలో దాచి పెట్టేశాడు…!! ఏంటీ వావ్..భలే భలే అనిపిస్తోంది కదూ..

చైనాకు చెందిన ఛాంగ్ యు టే అనే యువకుడు వందల గాలి బుడగలు ఊదేస్తాడు. అంతేకాదు వీటన్నింటిని మరో పెద్ద గాలి బుడగలో బంధించేశాడు. ఇంకా అలా ఊదిన గాలిబుడగలతో బంతి ఆట ఆడుకుంటాడు…!!

ఇలాంటి అసాధ్యాలను చిటికెలో చేసేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో రెండు సార్లు చోటు సంపాదించిన ఆ యువకుడు ఇప్పుడు రెప్పపాటులో 783 గాలి బుడగలు ఊదేసి కనువిందు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 120 సెకెన్లు అంటే కేవలం రెండు నిమిషాల్లో సోపుతో గాలి బుడగలు ఊదేసి తన ఫీట్ తో అందరి ఆశ్చర్యపరుస్తున్నాడీ చైనా అబ్బాయి.

ఛాంగ్ యు టే రెండు నిమిషాల్లో 783 గాలి బుడగలు ఊదేశాడు. అంతేనేంటీ..వీటన్నింటినీ మరోపెద్ద గాలి బుడగలో బంధించేసి చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. ఈ మొత్తం వీడియో చూస్తే ఓ పెద్ద గాలి బుడగ బ్యాగులా కనిపిస్తుంటే ఆ బ్యాగు అడుగున వందలాది చిన్న చిన్న గాలి బుడగలు నింపడం చూస్తే వావ్..వాటే వండర్ అని అనిపించకమానదు. స్లో మోషనల్ లో వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఇలాంటి ఫీట్లు చేయటం అంటే ఛాంగ్ కు భలే భలే ఇష్టం. అలాంటి ఫీట్లు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సాధించాడు.

తన అరచేతిపై సబ్బు నురగతో చేసిన గాలి బుడగను బంతిలా ఆడించాడు. గాలి బుడగ అంటే ఎంత సున్నితమైనదో తెలియందికాదు. చిన్నపాటి ఒత్తిడికే పగిలిపోతుంది. ముట్టుకుంటే టప్ మని పగిలి పోతుంది. అలాంటి సోప్ బబుల్ ను చాలా చాకచక్యంగా పగలకుండా కొన్ని నిమిషాల పాటు ఆ గాలి బుడగల్ని బంతిలా ఆడించాడు చాంగ్.

అదో వెరీ వెరీ హైలైట్ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురించేసింది. అసలు బిగ్ సోప్ బబుల్ లోపలి చిన్న బబుల్ ను ఎలా లెక్కించారబ్బా అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.