Chiranjeevi: RRR లాంటి సినిమాలకు పబ్లిసిటీ అక్కర్లేదు – చిరంజీవి!

టాలీవుడ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన తాప్సీ పన్ను ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’....

Chiranjeevi: RRR లాంటి సినిమాలకు పబ్లిసిటీ అక్కర్లేదు – చిరంజీవి!

Chiranjeevi Comments On Rrr In Mishan Impossible Pre Release Event

Chiranjeevi: టాలీవుడ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన తాప్సీ పన్ను ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘మిషన్ ఇంపాజిబుల్’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాను సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ RSJ తెరకెక్కిస్తుండగా, కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. కాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.

Mishan Impossible: తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పెద్ద సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదని.. వాటికున్న క్రేజ్ కారణంగా ఆ సినిమాలు ఆటోమేటిక్‌గా జనంలోకి వెళ్తాయని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు పబ్లిసిటీ ఏమాత్రం అవసరం లేదని.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ఆ సినిమాలో భాగమైనప్పుడే అలాంటి సినిమాలకు పబ్లిసిటీ వచ్చేసిందని.. అలాంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయని చిరు పేర్కొన్నారు. ఇక చిన్నసినిమాలైనా వాటికి అండగా ఉండటం మన బాధ్యత అని ఇండస్ట్రీ వారికి చిరు పిలుపునిచ్చారు. అయితే ఆచార్య చిత్రంతో బిజీగా ఉంటూనే నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఇలా ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహించడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చిరు అన్నారు.

తాను కూడా చిన్న సినిమాల నుండే వచ్చినవాడినని.. సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉంటే, ప్రేక్షకులు ఆ సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారని, ఇక నిర్మాతలు తమ సినిమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదని.. అది తనకు కాస్త బాధను కలిగిస్తుందని ఆయన అన్నారు. తాప్సీ ‘ఝుమ్మంది నాదం’ చిత్రం సమయంలో తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని, ఇలాంటి హీరోయిన్‌తో ఒక్క సినిమానైనా చేయాలని ఆయన కోరుకున్నానని చిరు అన్నారు.

Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!

ఇక ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు రోషన్, భాను, జై లు ఈ చిత్రానికి నిజమైన హీరోలు అని హీరోయిన్ తాప్సీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తనను తెలుగులో ఎందుకు చేస్తావని కొందరు అడిగారని.. అయితే తాను తన కెరీర్ స్టార్ట్ చేసిందే తెలుగులో అని.. అందుకే తెలుగు సినిమాలకు తాను అంతటి ప్రాధాన్యతను ఇస్తానని తాప్సీ చెప్పుకొచ్చింది. కాగా మిషన్ ఇంపాజిబుల్ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.