Chiranjeevi: కష్టాన్ని నమ్ముకున్నా.. ఈ స్థాయికి వచ్చా.. మీరూ అలాగే కష్టపడండి!

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా.. టైగర్ హిల్స్ ప్రొడక్షన్ నంబర్ వన్ గా వస్తున్న సినిమా టైటిల్ ను.. మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

Chiranjeevi: కష్టాన్ని నమ్ముకున్నా.. ఈ స్థాయికి వచ్చా.. మీరూ అలాగే కష్టపడండి!

Chiranjeevi

Chiranjeevi: సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా.. టైగర్ హిల్స్ ప్రొడక్షన్ నంబర్ వన్ గా వస్తున్న సినిమా టైటిల్ ను.. మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడిన చిరంజీవి.. కోటి, మణిశర్మతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

తాను కష్టాన్ని నమ్ముకున్నానని.. అందుకే ఈ స్థాయికి వచ్చానని చిరంజీవి చెప్పారు. కొత్త తరం కూడా అలాగే కష్టపడి.. ఉన్నత స్థానానికి రావాలని ఆకాంక్షించారు. సాలూరి వారసుడిగా సంగీత రంగంలో కోటి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించిన చిరు.. తాను ఈ స్థాయికి రావడంలో ప్రధాన పాత్ర కోటిదే అని చెప్పారు.

రాజ్ కోటి అందించిన సంగీతంతో.. తన చిత్రాలు ఎన్నో ఘన విజయాన్ని అందుకున్నాయని చెప్పారు. కోటికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని.. ఓ రకంగా ఈ కార్యక్రమానికి హాజరై కృతజ్ఞత తీర్చుకునే అవకాశాన్ని కోటి తనకు ఇచ్చారని చిరంజీవి అన్నారు. కోటి తన ఇద్దరు కుమారుల్లో ఒకరిని మ్యూజిక్ వైపు.. మరొకరిని యాక్టింగ్ వైపు నడిపించి మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.

మణిశర్మ ఇప్పటికీ యువ సంగీత దర్శకులతో పోటీ పడి మ్యూజిక్ అందిస్తున్నారన్న చిరు.. మణి తనయుడు కూడా టాలెంట్ చూపించుకుంటున్నాడని అప్రిషియేట్ చేశారు. తన తర్వాతి సినిమాకు మణిశర్మ తనయుడే సంగీత దర్శకత్వం అందిస్తున్నారని చెప్పారు. టాలెంటెడ్ యూత్ వస్తేనే.. సినిమా ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉంటుందని.. ఆ రకంగా మరింత మంది యువకులు సినిమా ఇండస్ట్రీకి రావాలని చిరంజీవి ఆకాంక్షించారు.

చిరంజీవితో తన అనుబంధం ఈనాటిది కాదని కోటి చెప్పారు. మణిశర్మ ఈ రోజుకీ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన కుమారుడి చిత్రానికి మణి సంగీతం అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ ఈవెంట్ లో సంగీత దర్శకుడు మణిశర్మతో పాటు.. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

Read More:

Bhola Shankar: చిరంజీవి భోళా శంకర్ ప్రారంభం.. 15నుంచి రెగ్యులర్ షూటింగ్!