HBD NBK: బాలయ్యకు చిరు, తారక్ శుభాకాంక్షలు.. ఫ్యాన్స్ ఖుషీ!

నందమూరి అందగాడు, ఎమ్మెల్యే బాలయ్య నేడు (జూన్ 10) 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సంబరాలకు దూరంగా ఉన్న నందమూరి అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి నుండే సోషల్ మీడియాలో విషెస్ తో అభిమానులు..

HBD NBK: బాలయ్యకు చిరు, తారక్ శుభాకాంక్షలు.. ఫ్యాన్స్ ఖుషీ!

Hbd Nbk

HBD NBK: నందమూరి అందగాడు, ఎమ్మెల్యే బాలయ్య నేడు (జూన్ 10) 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సంబరాలకు దూరంగా ఉన్న నందమూరి అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి నుండే సోషల్ మీడియాలో విషెస్ తో అభిమానులు ట్రెండింగ్ మొదలుపెట్టగా ఉదయం నుండి సినీ రాజకీయ ప్రముఖులు కూడా బాలయ్యకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. బాలయ్య పుట్టినరోజున ఎంతమంది విష్ చేసినా ఓ ఇద్దరి శుభాకాంక్షలు మాత్రం అభిమానులకు ఎప్పుడు స్పెషలే.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ సమకాలీకులన్న సంగతి తెలిసిందే. డజన్ల కొద్దీ సినిమాలతో ఇద్దరూ పోటీపడినా ఇద్దరి మధ్య స్నేహబంధానికి మించిన అనుబంధం ఉంటుంది. అందుకే బాలయ్య పుట్టినరోజున చిరు శుభాకాంక్షలకు ఈ ఇద్దరి అభిమానులు పొంగిపోతారు. ప్రతి బర్త్ డే మాదిరే ఈరోజు కూడా చిరంజీవి ట్విట్టర్ ద్వారా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మిత్రుడు బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఇక, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబాయ్ నందమూరి బాలకృష్ణల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలిసిందే. బాల బాబాయ్ అంటూ తారక్ చెప్పే శుభాకాంక్షలలో ఆప్యాయత కనిపిస్తుంది. ఈ పుట్టినరోజున కూడా తారక్ ట్విట్టర్ ద్వారా విషెష్ చెప్పాడు. ‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఓ త్రో బ్యాక్ ఫోటోను ట్యాగ్ చేశాడు. కాగా.. విషెష్ తో ఇప్పుడు బాలయ్య పేరు నేషనల్ ట్రెండ్ అవుతుంది.