Retirement of 3 dogs : రిటైరైన 3 స్నిఫర్ డాగ్‌లకు ఘనంగా సత్కారం

CISF మరియు DMRC లో పనిచేసిన 3 స్నిఫర్ డాగ్‌లకు ఘనంగా సత్కారం జరిగింది. 8 సంవత్సరాలకు పైగా నిస్వార్ధంగా సేవలు అందించిన ఈ శునకాలను అధికారులు ఘనంగా సత్కరించారు.

Retirement of 3 dogs : రిటైరైన 3 స్నిఫర్ డాగ్‌లకు ఘనంగా సత్కారం

Sniffer Dogs Retirement

Sniffer Dogs Retirement : డాగ్స్‌కి పతకాలు అందించారు. కేక్ కట్ చేయించారు. వాటికి సెల్యూట్ చేశారు. పూలతో అలంకరించిన కారులో తీసుకెళ్లారు. ఇదంతా ఎందుకు అంటే? అవి CISF మరియు DMRC  లో పనిచేసి పదవీ విరమణ చేసాయి. అందుకే వాటికి సత్కారం జరిగింది.

US University : యజమానితో పాటు డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం

రాకీ, రోమియో, సోని మూడు కుక్కలకు CISF మరియు DMRC లు ఘనంగా సత్కరించాయి. ఎనిమిదేళ్లకు పైబడి సేవలు అందించినందుకు గాను ఈ వేడుక జరిపారు. నిస్వార్థంగా సేవలు అందించినందుకుగానూ వీటిని సన్మానం జరిగింది. వాటిని స్టేజ్ పైకి గౌరవంగా ఆహ్వానించారు. మెడలో మెడల్ వేసి.. సన్మాన పత్రాన్ని అందించారు. కేక్ తినిపించారు. చివర్లో పూవులతో అలంకరించిన కారులో తీసుకువెళ్లారు.

 

అయితే ఈ కార్యక్రమానికి సోనీ అనే జర్మన్ షెపర్డ్ డాగ్  అనారోగ్యం కారణంగా రాలేకపోయింది. ఈ రిటైర్డ్ శునకాలను ఢిల్లీలోని ఫ్రెండ్ కోస్ఎస్ఇసిఎకు దత్తత కోసం అప్పగిస్తారట. కనీ వినీ ఎరుగని విధంగా సత్కారం పొందిన ఈ డాగ్స్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలామంది స్పందించారు.

Army Dog: తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు వదిలిన ఆర్మీ శునకం.. అవార్డు ప్రకటించిన ప్రభుత్వం

కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన సోనీ చిత్రం గురించి నెటిజన్లు ప్రశ్నించారు. కనీసం సోనీ ఫోటో పోస్ట్ చేసి ఉండాల్సిందని కామెంట్ చేశారు. ఇక ఈ డాగ్స్ సంతోషంగా విశ్రాంతి తీసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు అందరూ విష్ చేశారు.