Allu Arjun – Vijay Deverakonda : బన్నీ, విజయ్ దేవరకొండ సినిమాలు ఆగిపోలేదు.. త్వరలో స్టార్ట్ అవుతాయ్..

టాలీవుడ్‌‌లో ఈక్వేషన్లు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఫామ్‌లో ఉన్నారనో, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనో ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్న సినిమాల్ని పక్కన పెట్టి.. కొత్త సినిమాల్ని అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఆగిపోయిన సినిమాల్ని మళ్లీ తెరమీదకి తెస్తున్నారు..

Allu Arjun – Vijay Deverakonda : బన్నీ, విజయ్ దేవరకొండ సినిమాలు ఆగిపోలేదు.. త్వరలో స్టార్ట్ అవుతాయ్..

Allu Arjun – Vijay Deverakonda

Allu Arjun – Vijay Deverakonda: టాలీవుడ్‌‌లో ఈక్వేషన్లు రోజురోజుకీ మారిపోతున్నాయి. ఫామ్‌లో ఉన్నారనో, షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనో ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్న సినిమాల్ని పక్కన పెట్టి.. కొత్త సినిమాల్ని అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఆగిపోయిన సినిమాల్ని మళ్లీ తెరమీదకి తెస్తున్నారు. మరి ఇలా లైమ్ లైట్‌లోకి వచ్చిన అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సినిమాలెలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఒకప్పుడు సినిమా చేస్తున్నాం.. అని మాటిస్తే చాలు అదే ఫైనల్ అయ్యేది.. కానీ ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసినా కూడా అది రిలీజ్ అయ్యే వరకూ కూడా వర్కవుట్ అవుతుందో లేదో చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు హీరోలు మాత్రం కమిట్ అయిన సినిమాల్ని కంప్లీట్ చేస్తామంటున్నారు. బన్నీ, ఆగిపోయిన ‘ఐకాన్’ సినిమాని మళ్లీ తెరమీదకు తెస్తుంటే.. విజయ్ దేవరకొండ, సుకుమార్‌తో చేస్తున్న సినిమా ఆగిపోలేదని చెప్తున్నారు.

దిల్ రాజు బ్యానర్‌లో, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’ సినిమా రెండేళ్ల క్రితమే సెట్స్ మీదకి వెళ్లాల్సింది.  రకరకాల కారణాలతో ఆగిపోయిన ఆ సినిమా ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ‘వకీల్ సాబ్’ తో సూపర్ సక్సెస్ కొట్టిన అండర్ రేటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, దిల్ రాజు కాంబినేషన్లో నెక్ట్స్ రాబోయే సినిమా ఐకానే అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సబ్జెక్ట్ అమేజింగ్ అని, మంచి సోషల్ కాన్సెప్ట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సరికొత్తగా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్‌చెయ్యబోతున్నారట బన్నీ.

బన్నీ ‘ఐకాన్’ మూవీతో పాటు విజయ్ దేవరకొండ-సుకుమార్ సినిమా మీద కూడా టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇంటలెక్చువల్ డైరెక్టర్ సుకుమార్, ఎంగేజింగ్ హీరో విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కబోయే సినిమా వేరే లెవల్లో ఉండబోతోందని టాక్. సుకుమార్ టేకింగ్‌కి, విజయ్ యాక్టింగ్‌కి సరిపోయే క్రేజీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ .