Cloning Cow : ఎలర్జీలేని పాలకోసం క్లోనింగ్ ఆవు… రష్యా శాస్త్ర వేత్తల అద్భుత సృష్టి

ఈక్రమంలోనే మానవులలో లాక్టోజ్ అలెర్జీకి కారణమయ్యే బీటా లాక్టో గ్లోబులిన్ ను తొలగించారు. సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్సఫర్ పద్దతిని ఉపయోగించి ఆవు దూడను రూపొందించారు.

Cloning Cow : ఎలర్జీలేని పాలకోసం క్లోనింగ్ ఆవు… రష్యా శాస్త్ర వేత్తల అద్భుత సృష్టి

ఎలర్జీలేని పాలకోసం క్లోనింగ్ ఆవు

Cloning Cow : అలర్జీ రహిత మైన పాల కోసం రష్యా శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆవు జన్యువులలో ప్ర్యతేకమార్పులు చేయటం ద్వారా క్లోనింగ్ ఆవును రూపొందించారు. మాస్కోలోని స్కోల్కోవో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఎర్నెస్ట్ ఫెడరల్ లైవ్ స్టాక్ సైన్స్ సెంటర్ పరిశోధకులు ప్రయోగాల ఫలితంగా క్లోనింగ్ ఆవు దూడ జన్మించింది.

హైపో అలెర్జెనిక్ పాలను ఉత్పత్తి చేయాలన్నలక్ష్యంగా వీరి పరిశోధనలు సాగాయి. ఈక్రమంలోనే మానవులలో లాక్టోజ్ అలెర్జీకి కారణమయ్యే బీటా లాక్టో గ్లోబులిన్ ను తొలగించారు. సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్సఫర్ పద్దతిని ఉపయోగించి ఆవు దూడను రూపొందించారు. ప్రస్తుతం క్లోనింగ్ ఆవు దూడ ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఈ అవుదూడ 2020 ఏఫ్రియల్ లో జన్మించగా ప్రస్తుతం దానివయ్యస్సు 14నెలలు… 410 కిలో గ్రాముల బరువు ఉంది. సాధారణ పునరుత్పత్తి చక్రమంతో ఆరోగ్యంగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ ప్రయోగం భవిష్యత్తులో పాలఉత్పత్తి రంగంలో ఎంతో దోహదపడనుంది.