Cloudflare downtime : ఇండియాలో నిలిచిపోయిన క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు.. కొద్దిసేపటికే ఫిక్స్..!

Cloudflare Downtime : కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (CDN) ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు నిలిచిపోయాయి. దేశంలో కొద్దిసేపు సీడీఎన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

Cloudflare downtime : ఇండియాలో నిలిచిపోయిన క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు.. కొద్దిసేపటికే ఫిక్స్..!

Cloudflare Downtime Hits Several Services In India, Now Fixed (1)

Cloudflare Downtime : కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్ (CDN) ప్రొవైడర్ క్లౌడ్‌ఫ్లేర్ సర్వీసులు నిలిచిపోయాయి. దేశంలో కొద్దిసేపు సీడీఎన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దాంతో క్లౌడ్ ఫ్లేర్ సర్వీసులను వినియోగించుకునే అనేక మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్ వినియోగించే Shopify, Udemy, Zerodha, Canva, Discord, Acko Insurance వంటి దేశీయ సర్వీసుల్లోని వినియోగదారులకు 5xx error messages అంతరాయం కలిగినట్టు నివేదించారు. కొంతమంది వినియోగదారులు HTTP 504 Error కూడా వచ్చిందని నివేదించారు.

అంటే యూజర్ రిక్వెస్ట్ కంప్లీట్ కాకపోవడంతో సర్వర్ రెస్పాన్స్ అందకపోవచ్చు. ఆ సమయంలో ఇలాంటి ఎర్రర్ మెసేజ్ లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరికొంతమందికి 502 Bad Gateway error వచ్చిందని నివేదించారు. క్లౌడ్‌ఫ్లేర్ డౌన్‌టైమ్‌పై యూజర్ల నుంచి నివేదికలు సాయంత్రం 4 గంటల తర్వాత కనిపించడం ప్రారంభించాయి. ప్రభావితమైన సర్వీసులకు సంబంధించి యూజర్లు నుంచి ఫిర్యాదులు అందాయని క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్ తెలిపింది.

సాంకేతిక సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు క్లౌడ్‌ఫ్లేర్ బృందంతో కలిసి పని చేస్తున్నామని అకో జనరల్ ఇన్సూరెన్స్ ట్వీట్ చేసింది. మరోవైపు.. క్లౌడ్‌ఫ్లేర్ నెట్ వర్క్ కూడా స్పందించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే ఎదురైన సమస్యను పరిష్కారానికి పేర్కొంది. Cloudflare Downtime Hits Several Services In India, Now Fixed (2)

Cloudflare Downtime Hits Several Services In India, Now Fixedక్లౌడ్‌ఫ్లేర్ భారత ప్రాంతంలో నెట్‌వర్క్ పనితీరుతో సమస్యలను పరిశీలిస్తోంది. ప్రభావిత కస్టమర్‌లు 5xx error సమస్యలు ఏర్పడవచ్చు. ఈ సమస్యను విశ్లేషించి తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అధికారిక క్లౌడ్‌ఫ్లేర్ స్టేటస్ డ్యాష్‌బోర్డ్ తెలిపింది. కొన్ని గంటల తర్వాత.. కంపెనీ ఆ డ్యాష్‌బోర్డ్‌ను అప్‌డేట్ చేసిందని, పరిష్కార ఫలితాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.

క్లౌడ్‌ఫ్లేర్ వారమే క్రితం తన క్లయింట్‌లలో ఒకరిపై డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ (DDoS) అటాక్ గుర్తించినట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ అంతరాయం ఏర్పడింది. 5,067 డివైజ్ నుంచి సెకనుకు 26 మిలియన్ రిక్వెస్టులను సేకరించారు. వర్చువల్ మిషన్లు, సర్వర్‌ల వినియోగం కారణంగా క్లౌడ్‌ఫ్లేర్ ట్రాక్ చేస్తున్న 7.3 లక్షల డివైజ్‌ల బోట్‌నెట్ కన్నా 4000 రెట్లు బలంగా ఉంది. 30 సెకన్లలోపు, బోట్‌నెట్ 121 దేశాలలో 1,500 కంటే ఎక్కువ నెట్‌వర్క్‌ల నుంచి 212 మిలియన్ HTTPS రిక్వెస్టులు వచ్చాయని నివేదిక తెలిపింది.

Read Also : Telegram Premium : టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ కావాలా? నెలకు ఎంతంటే?