మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్

cm jagan bumper offer to women: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న స్మార్ట్ ఫోన్లు కొనే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రోజున ఫోన్ కొని…దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే ఈ 10 శాతం ఆఫర్‌ వర్తిస్తుంది. ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో రాయితీ ఉంటుంది. జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు ఈ కానుకను ప్రకటించారు సీఎం జగన్. కాగా, మార్చి 7న రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు:
* రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ
* దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ తో 2వేల స్టాండ్ లు ఏర్పాటు
* దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే మహిళలకు రాయితీ
* మార్చి 8న స్మార్ట్ ఫోన్ కొంటే 10శాతం రాయితీ
* ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో రాయితీ వర్తింపు
* మహిళా భద్రత, సాధికారతపై షార్ట్ ఫిల్మ్ పోటీలకు నిర్ణయం
* ప్రతి వింగ్ నుంచి ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం

* మహిళా దినోత్సవం రోజున పోలీస్ శాఖ ఉద్యోగులక స్పెషల్ డే ఆఫ్
* అంగన్ వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్
* మహిళా ఉద్యోగులకు 5 క్యాజువల్ లీవ్స్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకారం
* నాన్ గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ.5లక్షలు అందించాలని నిర్ణయం

రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించే దిశగా జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం ఇచ్చారు.

మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు. మహిళల భద్రత కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చింది జగన్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లను అందుబాటులోకి తెచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు.