CM Jagan: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను కలిసిన సీఎం జగన్

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా పెద్దలను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన సీఎం పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

CM Jagan: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను కలిసిన సీఎం జగన్

Cm Jagan

CM Jagan: ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా పెద్దలను కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించిన సీఎం పోలవరం పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, నేడు (జూన్ 11)న కేంద్ర పెట్రోలియం సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ను కలిశారు.

దాదాపు గంటకుపైగా ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగగా కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాలపై విస్తృత చర్చ జరిగినట్లు తెలుస్తుంది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం జగన్ కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలని సీఎం కోరగా ఏపీలో ఖచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వచ్చేవారం ఏపీ చీఫ్‌ సెక్రటరీ, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎంకు చెప్పిన కేంద్ర మంత్రి ఆరోజునే విధివిధానాలను ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించినట్టుగా తెలిసింది.