శిఖరాగ్రానికి గోదావరి : కొండపోచమ్మ ఆలయంలో CM KCR దంపతులు

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 02:31 AM IST
శిఖరాగ్రానికి గోదావరి : కొండపోచమ్మ ఆలయంలో CM KCR దంపతులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ టెంపుల్ కు చేరుకున్నారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, ఇతరులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో ఆలయ పూజారులు స్వాగతం పలికారు. ఆలయం లోపలకు వెళ్లిన..సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు గో పూజ నిర్వహించారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున నుంచి నిర్వహిస్తున్న చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

అనంతరం..వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం 9.35కి ఎర్రవల్లిలో.. 9.40కి మర్కుక్‌లోని రైతు వేదికలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం  9.50కి మర్కుక్ పంప్‌హౌస్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి… 10గంటలకు అక్కడికి హెలికాప్టర్‌లో చేరుకునే చిన్నజీయర్ స్వామిని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మర్కుక్‌ పంప్‌హౌజ్‌ వద్ద జరిగే సుదర్శనహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు పంప్‌ హౌస్‌ స్విచ్‌ ఆన్‌ చేసి రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు.

సృష్టికి ప్రతిసృష్టి జలవృష్టి…ఈ నీరు నేల దప్పికను తీర్చగల..జీవనాలిక. కొండపోచమ్మ తల్లికి నేటి కాళేశ్వరం జలాభిషేకంతో తెలంగాణ దశాబ్దాల దప్పిక తీరబోతోంది. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన..కాళేశ్వరం గంగా ప్రస్థానంలో సుందర దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో… సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద ర్మించిన రిజర్వాయర్‌ను 2020, మే 29వ తేదీ శుక్రవారం…ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

కాలువలను, చెరువులను నిండుకుండాల మారుస్తూ…వందల కిలోమీటర్లు ప్రయాణించిన..కాళేశ్వరం జలాలు..618 మీటర్లు ఎత్తులో కొండపోచమ్మ సిగలో కొలువుతీరబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన..ప్రదేశంలో కొండపోచమ్మ తల్లి సిగలో పువ్వై…మెరిసిపోవడానికి ఆత్రంగా వస్తోంది గోదారి. కాళేశ్వరం ప్రాజెక్టులో శిఖరాయమైన ఘట్టం…ఆవిష్కృతం కాబోతోంది. 

Read: కొండంత సంబరం : కొండ పోచమ్మ ప్రాజెక్టు..ఆ పేరు ఎలా వచ్చిందంటే ?