నర్సాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్

  • Published By: bheemraj ,Published On : December 10, 2020 / 04:20 PM IST
నర్సాపూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR inaugurated a double bedroom house : సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… నర్సాపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. నర్సాపూర్‌లో నూతనంగా నిర్మించిన 2 వేల 400 ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు.



గేటెడ్ కమ్యూనిటిగా కాలనీని నిర్మించడంపై కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ పైలాన్ వద్ద సర్వ మత ప్రార్థనంలు నిర్వహించారు. కాలనీకి కేసీఆర్ కాలనీగా పేరు పెట్టారు.



తెలంగాణలో సిద్ధిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని కొండపాక మండలం దుద్దెడలో ఐటీ పార్కుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం కోమటి చెరువు, నెక్లెస్ రోడ్డును సందర్శించారు.



చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన అధికారులను మెచ్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలకు సిద్ధిపేట అత్యంత క్రియా శీలక ప్రాంతమని తెలిపారు. భవిష్యత్తులో సిద్ధిపేట పరిధి ఐటీ రంగంలో పురోగతి సాధిస్తుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.