CM KCR : నేడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో భేటీ కాబోతున్నారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇక నిన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు.

CM KCR : నేడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ
ad

CM KCR : ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో భేటీ కాబోతున్నారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఇక నిన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎం కేసీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చారు.

ప్రతిపక్షాల పట్ల కేంద్రం వైఖరి, ఫెడరల్‌ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ సర్కారు నిర్ణయాలు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు గంటకు పైనే జరిగాయి. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కలిసి ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని కేసీఆర్‌, అఖిలేశ్‌ భావించారు.

CM KCR: అఖిలేశ్ యాద‌వ్‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం

అఖిలేష్‌తో పాటు ఆయన బాబాయ్, సమాజ్‌వాదీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కూడా ఉన్నారు. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారని, అందరూ కలిసి లంచ్ చేశారని సమాచారం. బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న సీఎం కేసీఆర్….ఇందులో భాగంగానే నేతలతో భేటీలు జరుపుతున్నట్టు చర్చించుకుంటున్నారు.